Powered By Blogger

Monday, August 27, 2012

Why should I have Caste Feeling?


నేను కమ్మ వాడిని, నాకు కుల గజ్జి లేదు.

ఈ మధ్య చాల మంది మిత్రులు మీరు కమ్మ వాళ్ళు కాబట్టి మీరు తెలుగుదేశం అని ఒక ముద్ర వేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే నేను పుట్టక ముందే మేము కాంగ్రెస్ తో విభేదించాము. మా తాత గోపాల్ రావు గారు కాని, పెద్ద తాత బాపయ్య గారు కాని, ప్రజాశక్తి ఎడిటర్ గా పనిచేసిన పెద్ద తాత తుమ్మల సుబ్బయ్య గారు కాని ఎవరు కాంగ్రెస్ కి మద్దతు చెప్పింది లేదు. బహుశా స్వాతంత్ర పోరాటం లో వారి 
దారి వారిది, మా దారి మాది. అప్పటి కమ్యునిస్ట్ పెద్దల పరిచయాల వాళ్ళ, వాళ్ళ నిస్వార్ధ దేశ భక్తికి లొంగిన పెద్దలు కమ్యునిస్ట్ పార్టీ లోనే కొనసాగారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టె ఇబ్బందులకు బలయ్యారు, రాటు దేలారు, కాంగ్రెస్ కి ఎదురు ఉంచోవటం అలవాటు చేసుకున్నారు. మేము అదే కొనసాగిస్తున్నాము. మాకు మారటానికి పెద్ద కారణాలు కూడా లేవు. ప్రభుత్వ రంగ సంస్థలతో మాకు పెద్ద పనులు ఉండవు, వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించే తెలివి తేటలు ఎలాగో లేవు. కనీసం మాట సాయం కూడా మాకు అక్కర్లేదు. మా అభిప్రాయం నిక్కచ్చిగానే ఉంటుంది.

నా సొంత కద పక్కన పెడితే, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఎందుకు ఎవరు అయిన ద్వేషించాలి అనేది నాకు అర్ధం కావట్లేదు. విజయవాడ లో ఇద్దరు గుండాల పంపకాల లెక్కల దగ్గర వచ్చిన గొడవని కులాల గొడవగా మార్చారు. అది కమ్మ వాళ్ళపైన వచ్చిన పెద్ద మచ్చ. అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ గొడవ తెలుగుదేశం పుట్టాక మొదలు కాలేదు, ఆ గొడవతో సంబంధం ఉన్న వ్యక్తులు ఐప్పుడు తెలుగుదేశంలో కూడా లేరు. ఆ గొడవలో ఉన్న రెండు కుటుంబాలు 2004 -2009 మద్య కాంగ్రెస్ లోనే ఉన్నాయి, తరువాత మల్లి కులాల లెక్కలు అంటూ అటు ఇటు పోతున్నాయి.

కుకట్పల్లి లో జయప్రకాశ్ నారాయణ్ గారు గెలిస్తే దానికి ఒక కులం వోట్లు అంటూ ముద్ర వేస్తారు రాజకీయ నాయకులూ. బూత్ వారిగా వోటింగ్ వివరాలు నా దగ్గర ఉన్నాయి, కేవలం కమ్మ కులం వాళ్ళు వోట్లు వేస్తేనే జయప్రకాశ్ నారాయణ గారు గెలిచార. అలా అయితే సేర్లింగంపల్లి కిందకు వచ్చే వివేకానందనగర్ లోకూడా తెలుగు దేశం వాళ్ళు గెలవాలి కదా, అక్కడ తెలుగు దేశానికీ వోటింగ్ తగ్గింది దానిని ఎలా ఉదహరిస్తారు మన రాజకీయ మేధావులు. మొన్న బాన్స్వాడ ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి వోటింగ్ తగ్గితే దానికి కమ్మ వాళ్లనే బాద్యత చెయ్యటం ఎలా సబబు అవుతుంది తెరాస మిత్రులే చెప్పాలి.

తెలంగాణా విషయానికి వస్తే కేంద్రంలో తమ పరపతి వాడి అడ్డుకున్నారు అని రాయపాటి, కావూరి, లగడపాటి లతో పాటు కమ్మ వాళ్ళని అంటారు, వ్యక్తిగతంగా వారిని అంటే ఇబ్బంది లేదు, వారి కులం అంటూ మల్లి కమ్మ వాల్లనే అంటారు, వాల్ల అభిప్రాయం తో విభేదించటం తప్పు అని నేను అనను కాని వారి కులం ఎ విధంగా వారి అభిప్రాయానికి సహకరించింది. వాళ్ళ తప్పు కూడా తెలుగుదేశం ఖాతా లోనే వేసి కుల గజ్జి అంటూ ఒక కులం మిధ ద్వేషానికి వాడుతున్నారు.

కమ్మ వాళ్ళను ఇబ్బంది పెట్టటం వాళ్ళకి ఒక ముద్ర అంటూ వేసి జనాల్లో నానేటట్టు చేసిన YSR గారి ప్రబుత్వంలోకుడా మనము గమనించాల్సింది ఏంటి అంటే, ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ కమ్మ వాడు, వాన్ పిక్ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కమ్మ వాడు, సాక్షి ఛానల్ పెట్టుబడుల్లో సింహబాగం ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్, లగడపాటి శ్రీధర్ కమ్మ వాడె. ఆఖరికి YSR గారు విజయవంతంగా చేసిన పాదయాత్ర కి దగ్గరుండి పెట్టుబడి పెట్టింది కమ్మ వాడు అయిన లగడపాటి రాజగోపాల్ కాదా.

అవసరాలకు వాడుకుని, రాజకీయంగా తొక్కటానికి కమ్మ అంటూ ఒక పార్టీ మిధ ముద్ర వెయ్యటం ఎంతవరకు సబబు. రాష్ట్రము లో చాల పార్టీ నాయకుల వలె, తెలుగుదేశం పార్టీకి కమ్మ నాయకత్వం ఉంది. అది ఎవరు కాదనలేని నిజం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు, ఉన్నత పదవుల్లో ఉన్న అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయడు, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, కోటగిరి విద్యాధర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయరామరావు, నిమ్మల కిష్టప్ప, రామ సుబ్బా రెడ్డి లాంటి వారు కమ్మ వారు కాదు అనేది గుర్తించరా, మన రాష్ట్ర స్పీకర్ గా పనిచేసిన ప్రతిభ బారతి గారు కూడా కమ్మ వారు కాదు. పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం, వారి ప్రాంతాల వాల్లకు సాయపడుతూ గెలుస్తూ వస్తున్నా మండవ వెంకటేశ్వర్ రావు, కోడెల శివప్రసాద్, లాంటి వాళ్ళకి పదవులు ఇవ్వటం తప్పు ఎలా అవుతుంది.

మేము కమ్మ వాళ్ళము కాబట్టి తెలుగుదేశం లో లేము, తెలుగుదేశం పాలసిలు నచ్చి ఉన్నాము. చంద్రబాబు నాయుడు, అంతక ముందు NTR గారి నాయకత్వం లో హైదరాబాద్ లో జరగని మత గర్షణలు చూసి తెలుగుదేశం లో ఉన్నాము. 1994 వరుకు ఇరుకుగా ఉండే రోడ్లను మరమత్తులు చేయించి విశాలంగా తాయారు చేసినందుకు తెలుగుదేశంలో ఉన్నాము, మన రోడ్లు మనమే సుబ్రపరుచుకోవచ్చు, మన దేశాన్ని మనమే బాగు పరుచుకోవచ్చు అని చెప్పిన జన్మ భూమి కార్యక్రమానికి మద్దతుగా తెలుగుదేశం లో ఉన్నాము. ధరలు ఆకాశానికి ఎదుగుతూ దళారులు దోచుకోవటము ఆపటానికి రైతులే తమ సరకుని అమ్ముకునే రైతుబజార్లలో సరుకులు కొనుక్కుని తిన్నాము అనే విశ్వాసముతో తెలుగుదేశంలో ఉన్నాము. కుల పిచ్చితో కాదు.

కుల పిచ్చి తో తెలుగు దేశం లో ఎవరన్న ఉండాలి అనుకుంటే దయచేసి వదిలేసి పొండి. కమ్మ కుల నాయకులూ ఇతర పార్టీలలో కూడా ఉన్నారు, వారు మనకు శత్రువులు ఏమి కారు, వారినే అనుసరించండి. సిద్దంతాలు, తెలుగువాడికి మేలు, ఆత్మగౌరవం కలిగించే పార్టీ తెలుగు దేశం అని మీకు అనిపిస్తేనే తెలుగు దేశంలో ఉండండి. కులం పిచ్చి తో రాజకీయము నడవదు అనేది నా భావన. రేపు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మీ నియోజకవర్గం లో ప్రజలకు మేలు చేసే నాయకులను బరిలోకి పెట్టకపోతే, ఒకవేళ ఇంకో పార్టీ లో నాయకుడి వల్ల ప్రజలకు మంచి జరుగుద్ది అని నమ్మితే వాల్లకే వోట్లు వెయ్యండి. అలోచించి వెయ్యండి, అనాలోచిత నిర్నయలతోనో, కుల పిచ్చితోనో వోట్లు వేసి అభాసు పాలు కాకండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.