Powered By Blogger

Sunday, June 24, 2012

Arrested Congress


జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ గారికి ఫోన్ చెయ్యలేదు అని పత్రిక విలేఖరులు కాదనలేదు, జాయింట్ డైరెక్టర్ గారు కూడా కాదనలేదు, నియమావళి ఏమి చెప్పింది, ఆ నియమావళి చెప్పినట్టు జాయింట్ డైరెక్టర్ గారు నడుచుకున్నార లేదా అనేది సిబిఐ జవాబు చెప్పాల్సిన ప్రశ్న. ఎవరి ఖోణం లో వాళ్ళు ప్రశ్నలు లేవనేట్టుతున్నారు కాబట్టి నా హక్కు ప్రకారం నేను కూడా ఒక ప్రశ్న లేపుతాను. బోఫోర్స్ కుంబకోణం దర్యాప్తు జరుగుతున్నప్పుడు కాని, మన రాష్ట్రము లో ఒక మాజీ మంత్రి, అప్పటి MLA హత్య కేసు అప్పుడు కూడా ఇంత కంటే ఎక్కువ కాదనలే ప్రచురితమయ్యాయి. ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు అన్వయిన్చుకున్నారు. అది తప్పు కూడా కాదు.

ఇప్పటికే చెప్పిన CBI అంటేనే కాంగ్రెస్ బురో అఫ్ ఇన్వెస్టిగేషణ్ అనే దానికి నేను ఇప్పటికి పునరుద్దరిస్తాను. మన రాష్ట్రము లో ఒకప్పుడు నమ్మి ఇప్పుడు నమ్మని వాళ్ళను, వాళ్ళ వాదనలోని డొల్లతనాన్ని ప్రశ్నించే హక్కు నాకు ఉంది. 

ఒకవేళ వార్త పత్రికలూ ఈ విషయాలను ప్రచురించకుండా మన కాంగ్రెస్, దానితోక పార్టీ అయ్యిన YSR కాంగ్రెస్ రేపు లాలుచి పడి కలిసిపోతే మన నాయకులే మనకు ఇంకో రకముగా చెవిలో పులు పెడతారు.

సోనియా గాంధీ - జగన్ మా ప్రియతమ నాయకుడు రాజశేఖర్ గారి అబ్బాయి, మాకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఐప్పుడు అన్ని సర్దుకున్నాయి. జగన్ బాబు మా అందరి అభిస్తం మేరకు రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చెయ్యటానికి కష్టపడతారు.

వి. హనుమంత రావు - అన్ని మీరె చెప్తారా, జగన్ నాకు చిన్నప్పటి నుంచి ఎరుక. ఐలాంటి పనులు అయన చెయ్యరు, మీరందరూ అనుమానం అంటే అది తిర్చనికి ఈ సిబిఐ కేసు వేసినం, ఐప్పుడు చుడండి దూద్ గా దూద్ పాణి కా పాణి అయ్యింది.

శంకర్ రావు - నిజం బయటకి రావాలి అనే ఆ కేసు వేసిన, మేము తప్పు చెయ్యలేదు, చెయ్యలేము అంటే మీరు నమ్మట్లేదు కదా. అయిన నేను ఉప ఎన్నికలప్పుడే చెప్పిన కదా మా జగన్ బాబు మేము ఒక్కటే అని.

లగడపాటి - YSR గారు మా నాయకడు, పేదల కోసం చాల కష్టపడ్డారు, అయనకి బారత రత్న ఇవ్వాలి అని కోరుకుంటున్న.

జగన్ బాబు - చిన్న తనం, రాజకీయం సరిగ్గా తెలిదు. ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు చేద్దామనుకున్న, మేడం ఒప్పుకోలేదు, ఏమి చెయ్యాలో తోచక అలా చెయ్యాల్సి వచ్చింది. ఐప్పుడు అన్ని అపార్ధాలు పోయాయి, మా నాన్న గారి ఆశయం మేరకు రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవ్వటానికి నేను చెయ్యాల్సిన కృషి చేస్తాను. మన రాష్ట్రము కూడా మున్నెన్నడు లేని విధంగా ముందుకు తిసుకుపోతాము.

అంబటి రాంబాబు - మీ గొడవ తగలెయ్య, నేనెప్పుడు చెప్పా పధకాలు సరిగ్గా అమలు కావట్లేదు అని, మా పక్కూరు "సంజన" కి ఫీజు రీ-ఇమ్బుర్స్మెంట్ సరిగ్గా జరగలేదు అని ప్రస్నించ. తరువాత తెలిసింది అసలు "సంజన" విద్యర్దే కాదు అని. 

గాలి జనార్ధన్ రెడ్డి - మీరు మీరు బాగున్నారు, మద్యన ఆ బైల్ ఫర్ సెల్ కేసు వేసి నన్ను కుమ్ముతున్నారు, రాజకీయాలు గబ్బులేసాయి పో. 

ఇలా చిలక పలుకులు పలుకుతారు. ఎన్ని సార్లు చూడలేదు సామి ఈ డ్రామా, మూస కధలతో నడిచే తెలుగు సినిమాలగా అవే కధలు అవే పలుకులు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.