Powered By Blogger

Sunday, June 24, 2012

Responsibility and Recognition


పంజాగుట్ట సాయిబాబా గుడిలో ప్రసాదం అందలేదు, దిల్శుకనగర్ సాయిబాబా గుడిలో ప్రసాదం అందింది కాబట్టి ప్రసాదం ఇచ్చిన అయ్యగారు/పంతులు గారు దేవుడు అవ్వరు. వాళ్ళు సాయిబాబా గుడిలో నిష్టగా పూజలు చేసి, వచ్చిన వారికీ మంచి జరగాలి అని కోరుకుని, మంచిని చెప్పి, చెడుని విడమరిచి లోక కళ్యాణం చూడాల్సిన బాద్యత ఉన్న వారు మాత్రమె. ప్రసాదం పంచటం వాళ్ళ వృత్తిలో భాగం మాత్రమే, అది కూడా తమ పర అనే బేధం లేకుండా విలయ్యినంత మందికి పంచటానికి ప్రయత్నించాలి. 

అలాగే ముఖ్యమంత్రి అనేవాడు, రాష్ట్ర సంపదని తనకి ఇష్టం వచ్చిన వారికో, తన వారికో పంచటం కోసం ఇచ్చే పదవి కాదు. మన రాష్ట్రము కోసం, ఆ రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి, ఒక ప్రణాళిక పదంగా అభివృద్ధి చెయ్యటం ఎలా అని ఆలోచించాలి. అంతే తప్ప "మూడో ఏడు పిల్లవాడులా మారాం చేసాడు కొడుకు, మొదటి సంతానం కదా అని తోటి మంత్రులను పనివళ్ళ కింద జమకట్టి బెదిరించి సంతకాలు చేయించుకున్నారు తండ్రి గారు". కొడుక్కి పంచాక మిగిలినవి ప్రజలకు రెండు మెతుకులు విసిరారు.

రెండు మెతుకులు తిన్న ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు, కొడుకు గారు మాత్రం, తన తండ్రి దగ్గర పని చేసిన పని వాళ్ళను మీరు మా తండ్రి గారి మాట వినటమే తప్పు అనేలా ప్రవర్తిస్తూ, ప్రజల పాలి యువరాజ వారి వలె హక్కు జమాయిస్తున్నారు.

మనకు తెలియాల్సింది ఏమిటి అంటే, ఈ కొడుకు గారిని అటుపక్క ఇటుపక్క నలుగు తగిలించి, ఇది తప్పు రా, ప్రజలు మనకు బాద్యత ఇచ్చారు, మనము బాద్యత గా ఉండాలి అని చెప్పి ఉంటె బాగుండేది, కాదు మనది ఫాక్టన్ బాక్గ్రౌండ్ కాబట్టి కొట్టి తిట్టి గట్టి పరిచి, అబద్దాలకి అలవాటు చేస్తే మనకు నిజం తెలిసే అవకాశమే లేదు. 

Punishment just teaches kids to be better liars.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.