Powered By Blogger

Sunday, June 24, 2012

Conspiracy theory to CONSPIRACY


ఒక గాలి వార్తను నమ్మితే మాత్రం మనకు పోయేదేముంది.

మన మహా నేత గారి మరణము ప్రమాదవసాత్తు జరగలేదు, ఇది రిలయన్స్ వారి ప్రోద్బలంతో సోనియా గాంధీ గారి అనుమతితో జరిగింది అని జైలు లో ఉన్న యువనేత బయట ఉన్న రాజమాత గారు ప్రచారంలోకి తీసుకు వచ్చారు, ఇది నిజమే అనుకున్న దానివల్ల నష్టమే తప్ప లాభము లేదు. 

రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎవరు కాదనలేనిది. మన యువనేత పార్టీ లో ముక్యనేత జూపూడి ప్రభాకర్ రావు లాంటి వారె, టీవీ ముఖంగా, 2009 ఎన్నికల్లో నాకు కొండేపి సీట్ ఇద్దాము అనుకున్న మహా నేత గారు, నా దగ్గర ఎంత సొమ్ము ఉంది అని అడిగారు, అప్పటిలో నా దగ్గర ఉన్న నలుగు లక్షలు గురించి చెప్తే సీట్ కేటాయించకుండా ఇంకో ధనిక వర్గానికి చెందినా వారికీ కేటాయించారు అని నిర్మొహమాటంగా నిజం చెప్పారు. 

ఇవ్వాల్టి రోజున ఆర్ధిక నేరాలకు పాల్పడి జైలు జీవితం గడుపుతున్న అనుమానితుడి ఆస్తి మొత్తం చూసుకున్న రిలయన్స్ వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద లెక్క ఏమి కాదు, పైగా ఢిల్లీ లెవెల్ లో లాయర్లను మేపిన తరువాత బయటకి వచ్చిన రిలయన్స్ వాళ్ళతో పోటి పడేంత అయితే ఉండదు. ఒక రాష్ట్రము లో పత్రిక పచ్చళ్ళు అమ్ముకునే వాడిని కేలికితేనే రాజమండ్రి లో ఉండవల్లి ప్రబుత్వ యంత్రాంగాన్ని వాడుకుని గెలవాల్సిన పరిస్తితి. ఇక బారత దేశం మొత్తం మిధ ఎన్నో వ్యాపారాలు చేసే రిలయన్స్ తో పోటి పడటం సాధ్యమేనా?

అసలు ఈ గాలి వార్తని నమ్మించాలి అన్న, దాని వెనక ఒక కదా చెప్పాలి కదా, ఇప్పటికే ఆంధ్ర మొత్తం వ్యాపించిన కధ ఏంటి అంటే, మనకు గ్యాస్ నిక్షేపాలు కాకినాడలో ఉన్నాయి. వాటిని రిలయన్స్ వాళ్ళు గుజరాత్ తీసుకుపోయి లాభాలు సంపాదిస్తున్నారు. మన మహా నేత గారు, అలా కుదరదు, మాకు కూడా వాటాలు కావాలి, మా అబ్బాయి పేరిట 15 % ఇవ్వండి అని అడిగారు, రిలయన్స్ వాళ్ళు దానికి కుదరదు, మాకు ఢిల్లీ లెవల్లో పేరు ఉంది, కాబట్టి మీకు ఒక లెక్క అనుకుని దానిని ఇస్తాము అని చెప్పారు, దానికి మహానేత ఒప్పుకోలేదు, పంచాయతి సోనియా దగ్గరకి వెళ్ళినా, ఇది మా రాష్ట్రము మాకు వాటా ఇవ్వాల్సిందే అని మహానేత పట్టు పట్టారు, గాలిమోటర్ల ప్రమాదాల్లో ఆరితేరిన రిలయన్స్ వాళ్ళు, ఇంకోటి ప్లాన్ చేసి వాతావరణం సహాయము తీసుకుని పెద్దయ్యన్ని పరలోకలకు పంపించారు.

దీన్లో కూడా యువ నేతకు ఇబ్బందే కదా, మా నాన్న నా లాభం కోసమే పట్టు పట్టాల్సి వచ్చింది అని ప్రజలకి చెప్పాలిగా. అల చెప్తే లాభం కంటే నష్టమే ఎక్కువేమో? పోనే ఈ కాదని అటు ఇటు తిప్పి చెప్పేద్దము అని ఆలోచించిన, మహా నేత గారు చనిపోయాక అదే కాంగ్రెస్ పార్టీ శాసన సబ్యుల తో సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవుదాము అని అనుకున్నారుగా, పోనీ అప్పుడు మాకు సోనియా మిధ అనుమానం లేదు అని చెప్పిన, రోశయ్య గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వచ్చిన హైదరాబాద్ కార్పోరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం ఎందుకు చేసినట్టు, ఏదో ఉపయోగం ఉండదు అనుకుంటే.

అది కాదన్నా, బాబాయ్ కి మంత్రి పదవి ఇవ్వక ముందు ఢిల్లీ విదుల్లో అమ్మ కొడుకు వెళ్లి సోనియా గాంధీ గారి అప్పాయింట్మెంట్ కోసం ఎందుకు నిరిక్షిన్చినట్టు. 

ఇలాంటి ప్రశ్నలు అన్ని నా చిన్న బుర్రకు తట్టడం లేదు, కనీసం యువ నేతను సమర్ధించే మిత్రులు జవాబులు చెప్తే తెలుసుకుంటాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.