Powered By Blogger

Sunday, June 24, 2012

Parallel Politics


నాయకుడు అనేవాడు, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, తన చుట్టూ ఉన్న పది మందిలో ఆ లక్ష్యం వివరించ గలగాలి, ఆ లక్ష్యం సాదించే దిశగా జనాలను/ప్రజలను ఉత్తేజపరచగలగాలి, ఆ లక్ష్యాన్ని చేదించగలగాలి. 

అంతే కాని పక్కన కుర్చుని పుస్తకాలూ చదువుతూ మేధావి రూపంలో నటిస్తూ, ఆ నటననే నిజం అనుకుంటూ ప్రజలు తన నటనని ఇంక ఎందుకు నమ్మటములేదు అనే ఆలోచనతో అవకాశాల కోసం అర్రులు జాచ కూడదు. 

రాజకీయాల్లో ఏమాత్రం అనుభవము లేకపోయినా కేవలం తన మొండితనము, చిత్ర పరిశ్రమలో ఉన్న జనాకర్షణ, ప్రజలకు ఎమన్నా చెయ్యాలి అనే ఆలోచనతో పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి, తరువాత జాతీయ స్తాయిలో గుర్తింపు పొందిన నాయకుడుగా ఎదిగి నాయకుడికి అర్ధం చెప్పింది NTR 

అంతే ఉత్సాహముతో, రాజకీయాలు మర్చుథాము అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అధినేత గెలిచింది ఒక్క సీట్. ఆ గెలిచినా సీట్లో కూడా తన ఆదర్శాన్ని గెలిపించుకోలేక పోయారు. మూడు ఏళ్ళలో ఆ ఆదర్శాన్ని నమ్మే అయిదుగురు నాయకులను తాయారు చేసుకోలేకపోయారు. గెలిచినా నియోజకవర్గం లోనే కార్పొరేటర్ ఎన్నికలు వస్తే పోటి చేసిన మొత్తం 5 డివిజన్లకు గాని వచ్చిన వోట్లు 11116 అది తానూ గెలిచినప్పుడు వచ్చిన మజోరిటి కంటే కూడా తక్కువ. 

గెలిచినా ఒక్క నియోజకవరం లో కూడా తన ఆశయానికి తోడుగా ఐదుగురిని తాయారు చేసుకుని, తన ఆశయం మంచిది అని నిరూపించుకుని, నిర్మనించుకోలేని నాయకుడు రేపు రాష్ట్రము మొత్తం అంటే 294 సీట్ల లో పోటి చేసి రాష్ట్ర ప్రజల ఆలోచన సరలి మారుస్తాను అంటే ఎలా నమ్మాలి?

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారయణ తనకున్న పరిదుల మేరకు చక్కగా తన పని తాను చెయ్యట్లేద, సమాజం లో మురికిని కదిగేయ్యట్లేదా, సమాజానికి సేవ చెయ్యట్లేదా, మరి మన మాజీ కలెక్టర్ గారు తన పదవికి రాజీనామా చేసి సమాజానికి చేసిన సేవ ఏమిటి?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.