మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి అని ఇప్పటికిప్పుడు చెప్పలేము కాని మన అదృష్టం బాగుండి ఐప్పుడు జైలు లో ఉన్న వారు అక్కడే రెస్ట్ తీసుకుని, మన విజయమ్మ గారు చంద్రబాబు మిధ వేసిన కేసు ని కెసిఆర్ గారి మిధ మన తెలుగు దేశం నాయకులూ వేసిన ఆరోపణలను కూడా కోర్ట్ పరిగణలోకి తీసుకుని JD గారికి రోజుకి అరగంట ఈ కేసులపై ద్రుష్టి సారించమని, ఆయనకు న్యాయపరంగా వెల్లమని కేంద్రం కూడా అనుమతులు ఇస్తే మన దేశం మాట ఏమో గాని, రాష్ట్రము మాత్రం చాల బాగుంటుంది. మనకు మంచిది కూడా.
ఒక్క బెయిల్ కే పది కోట్లు కర్చు అంటే, ఈ కేసులు అన్ని ఇలాగ ఒక మూడు ఏళ్ళు జరిగితే, ఎన్ని కోట్లు బయట పడతాయో, ఎందరు జైలుకి వెళ్ళాల్సి వస్తుందో. ఈ డబ్బులు అన్ని పోగేసి, మన నాయకులూ, వాళ్ళ చుట్టూ ఉండే కోటరిలు, వాళ్ళను బెయిల్ మిధ విడుదుల చెయ్యాలి అనుకున్న జడ్జ్ లను కలిపి మన జగన్ బాబు బెంగుళూరులో కట్టించినట్టు ఒక భారి AC జైలు, 60 బెడ్రూమ్లతో ఏర్పాటు చేసి, విల్లందరినీ శాశ్వత ఖైదిలుగా చేస్తే మన అదృష్టాన్ని చూసి మనము మురిసిపోవాలి, మన చుట్టూ పక్కల వాళ్ళు అసూయా పడాలి.
మనకి ఒక చారిత్రాత్మిక కట్టడం కూడా మిగులుతుంది. మన బావి తరాల వారు వెయ్యో రెండు వేలో టికెట్ పెట్టి విదేసియులను కూడా ఆకర్షించే టూరిస్ట్ దేస్తినేషాన్ అవుతుంది.
ఇది జగన్ బాబు బెడ్ రూం, ఆయనకి అన్ని ఇటాలియన్వె నచ్చుతాయి.
ఇది చంద్రబాబు గారి బెడ్ రూం, ఆయనకి అన్ని సింగపూర్వె నచ్చుతాయి.
ఇది మన K A పాల్ గారి బెడ్ రూం, ఆయనకి అన్ని దేసాలవి నచ్చుతాయి,
ఇది మన కెసిఆర్ గారి బెడ్ రూం, ఆయనకు తెలంగానవి నచ్చాల్సి వచ్చింది.
ఇది మన జడ్జి పట్టాభి గారి బెడ్ రూం, ఆయనకు నచ్చాల్సిన పనిలేదు, కొడుక్కి నచ్చినవే వాడాడు.
ఇది మన గాలి జనార్ధన్ రెడ్డి గారి బెడ్ రూం, ఆయనకు అన్ని బంగారు పోతలతో ఉంటేనే ఇష్టం. ప్రత్యెక అనుమతి తో ఈ సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడు. భూమి లోపల తవ్వుకోతనికి OMC వారు తాయారు చేసిన ఇనప చువ్వ కూడా ఇచ్చాము.
ఇది మన నిమ్మగడ్డ ప్రసాద్ గారి బెడ్ రూం, ఆయనకు ఎక్కడ భుములు సరిపోలేదు కాబట్టి జగన్ బాబు గారి బ్యాక్ యార్డ్ తో పాటు ప్రహరి గోడలోపల ఉన్న భూమి కూడా కేటాయించాము.
ఇది మన శ్రీ లక్ష్మి గారి బెడ్ రూం, ఆమె తల మిధ గదిని సబితమ్మకు కేటాయించము. ఎవరో ఒకరు చెప్తే కాని ఈమ ఏమి చెయ్యదు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.