Powered By Blogger

Sunday, June 24, 2012

Leaders we should elect


రాజకీయాల్లో గెలుపులు ఓటములు మాములే. కొంత మంది గెలిస్తే మంచిది, కొందరు ఓడితే మంచిది. ఈ ఎన్నికల వరుకు డబ్బులు కర్చు చేసి గెలవా వచ్చు, కులం వాడి గెలవా వచ్చు, కాని గుణం తో గెలవాల్సిన వాళ్ళు కొందరే.

చెంగల వెంకట్ రావు - ఒకప్పుడు సిని నిర్మాతగా, తరువాత అసెంబ్లీ కి ఎన్నికైన పయకరాపేట ప్రతినిధిగా, మంత్రిగా పనిచేసిన అనుభవము ఉంది. నియోజకవర్గం లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, చాల సార్లు ప్రజల ఇబ్బందులను విజయవంతంగా ప్రబుత్వము దృష్టికి తెచ్చారు, ఒక MLA గా నాకు తెలిసినంతవరుకు ఏది చెయ్యాలో అదే చేసారు. 

చిక్కాల రామచంద్ర రావు - 5 సార్లు MLA గా ఎన్నికయ్యారు, 3 సార్లు మంత్రి గా పనిచేసారు, ఒక్క రూపాయి తిన్నడన్నామాట లేదు. నిరాడంబర జివి, మారుతున్నా డబ్బుతో కూడిన రాజకీయానికి పనికిరాను, నాకు పోటి చెయ్యటానికి టికెట్ వద్దు అని చెప్పి పక్కకి తప్పుకున్న నాయకుడు. ఇలాంటి వారు గెలవటం మన రాష్ట్రానికి దేశానికీ ముక్యం.

మనకు తెలీని అన్న హజారే కరప్షన్ వద్దు అంటే మన తప్పు లెక్క పెట్టుకోకుండా పోలో అంటూ వెనక నడిచాము, మనల్ని ఏలిన నాయకుడు, నిజాయతి పరుడుని ఎన్నుకోటానికి సంకోచిస్తున్నాము. ఓడిన గెలిచినా ఎలాంటి నాయకులూ రావాలి అని కోరుకుందాము.

ఇది నాకు తెలిసినంతవరుకు మాత్రమే, ఒకవేళ విరు ఎమన్నా తప్పులు చేసిఉంటే చెప్పండి, నేను కూడా నా వాదన మార్చుకుంట.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.