మహా నేత మహా మోసగాడ..
నేను అమెరికా లో నానా గడ్డి కరిచి, పదేళ్ళలో USA లో 31 రాష్ట్రాల్లో బహుళ జాతి సంస్థల్లో పనిచేసి, ఆంధ్ర లో మూడు జిల్లాలలో మిగుల్చుకున్న డబ్బులు అన్ని పెట్టుబడి పెడితే నాకు ఉన్న ఆస్తి నలుగు కోట్లు ఉండదు. మన మహానేత తోడల్లుడు సుబ్బారెడ్డి గారు కేవలం ఒక్క ప్రొజెక్ట్ లో మహా మోసగది అండ తో సంపాదించింది ఎంతో ఇంకా లెక్క తేలలేదు, కేవలం VUDA కి పెట్టిన సటగోపం విలువ 348 కోట్లు.
ఎప్పటి నా సంపాదన లెక్కలో చూసుకుంటే, నా లాంటి వంద మంది అన్ని ఆపుకుని పైసా పైసా కుదబెడితే వచ్చే డబ్బులతో సమానము. నాకు ఇంకా అదృష్టం ఎక్కువ, చెన్నై కాన్సులేట్ కనుకరించి అమెరికా కి పంపించింది. 2001 వరుకు నాకు హైదరాబాద్ లో మీడియా మేనేజర్ గా పనిచేసినప్పుడు వచ్చింది నెలకు 5000 రూపాయలు. సంవత్సరానికి 60,000 రూపాయలు. సగటున 45 సంవత్సరాలు పనిచేసిన నాకు వచ్చేది 27 లక్షలు. అంటే నాలాంటి వాళ్ళు 1300 జీవితాంతము కాస్త పడితే వచ్చే జీతం. కర్చులు పోను అంత మిగలాలి అంటే ఇంకో 5000 మని అన్న కలవాలి.
ఇలాంటి వాళ్ళను తనవాళ్ళు అని వెనకేసుకు వచ్చే వాడు మహానాయకుడు ఎలా అవుతాడు. పచ్చి మోసగాడు తప్ప.
ఇంకా చిన్నప్పటినుంచి కూలి పనులు చేసుకుని అమ్మ బాబులకు ఒక సంపాదించే పిల్లడుగా మిగిలే ఈ బొమ్మ లోని పిల్లల సంపాదన తో పోల్చుకుని ఆలోచించుకోండి. ఎక్కడికి పోతుంది మన దేశం.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.