Powered By Blogger

Sunday, June 24, 2012

CBN and His works with APSEB

CM గా చంద్రబాబు ఉన్నప్పుడు APSEB తో చాలా దగ్గర అనుభవం నాది. APTRANSCO, APGENCO లోగోస్ కూడా నా దేసిన్స్. అప్పట్లో విద్యుత్ సౌద లో పని చేసే కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్తితి. మన మహానేత గారు కూడా కరెంటు చర్గెస్ ఎకదోబ్బితే కరెంటు కట్ చేస్తాము అని నోటీసు ఇచ్చాక బిల్ కట్టిన వాడె.

చదువుకున్న అతని అభిమానులు ఈ విధంగా ఉచితము అనటము తప్పు. రైతులకు తక్కువ ధరకి కరెంటు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ తెలుగు దేశం మాత్రమే. తెలంగాణ లో రైతులకు చాలా ఉపయోగపడిన స్కేమే ఈ తక్కువ ధరకు విద్యుత్. కాని అప్పటికే తెలంగాణ లో కాష్ క్రోప్స్ పండించటం పెరిగి వ్యవసాయం కొంత లాభదాయకం అయ్యింది అనే భావన తో, రాష్ట్రము లో విద్యుత్ సఖని పునరుద్దరించాకపోతే రాబోయే కలం లో మరిన్ని కరెంటు కోతల అవసరం వస్తుంది అనే ఆలోచనతో విద్యుత్ రేట్లు పెంచి తప్పు చేసారు చంద్రబాబు. ఈ అవసరాన్ని, విద్యుత్ శాఖ లోని సంక్షోబంని అప్పటి విద్యుత్ సఖ మాత్యులు, ఎప్పటి కాంగ్రెస్ నరసాపురం అబ్యార్ది కొత్తపల్లి సుబ్బారాయుడు, మరియు అప్పటి ముక్య మంత్రి చంద్రబాబు చాలా సార్లు అసెంబ్లీ లో వివరించారు.

చాలా సందర్భాల్లో రోజు వారి రిపోర్ట్ తెప్పించుకుని, ఈ రోజుకారోజు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత కావాలి, ఆ లోటుని ఎలా బర్తి చెయ్యాలి అనేది దిన దిన గండం గా నడిచింది.

చదువుకొని ప్రజలు తమ కష్టాలు చెప్పుకుంటే వినాల్సిన అవసరం నాయకులకి ఉంది, కానీ అదేదో నిలదియ్యటం లాంటి పదాలు వాడటం చదువు కునే వాళ్ళు చెయ్యాల్సిన పని కాదు. ప్రబుత్వం లో రోజు వారి ఇబ్బందులు చెప్పే స్తాయిలో నాయకులూ, అది అర్ధం చేసుకుని మెలిగే విధంగా ప్రజలు ఉండాల్సిన అవసరం మనలాంటి పెరుగుతున్న దేశాలకు చాలా అవసరం.

ముఖ స్తుతి కోసం అబద్దాలు చెప్పి, తరువాత ఇదే మీ గతి అని గాలికొదిలేసే నాయకుల కంటే చంద్రబాబు చేసేది నయమే.

నిజాన్ని ఒప్పుకుండము, తప్పుని సరిదిద్దుకుందాము

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.