తెలంగాణ మిత్రులు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, చంద్రబాబు తెలంగాణ కి వ్యతిరేకం కాదు, తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని చదువుకుని, తప్పు అని తన దృష్టికి వచ్చిన దానిని సవరించాతమే కాక గవర్నమెంట్ ఫైల్ లో నోట్ చేసిన విష్యం తెలుగు దేశం బహిష్కృత నేత నాగం జనార్ధన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు.
నాగం జనార్ధన్ రెడ్డి గారికి ఈ ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి తెలుగు దేశం తో సంబంధం లేదు, పైగా చంద్రబాబు, అతడి పార్టి నాయకులూ, నాగం ని ఆగం చేస్తాము అని ఎన్నికల వేల తిరిగి గొడవ పడ్డారు. నిజం చెప్పిన నాగం ని అభినందించాల్సిందే, అలాగే ఆ నిజాన్ని తెలుసుకుని అవుతున్న తప్పిదాన్ని "6 పాయింట్ ఫార్ముల" ప్రకారం సవరించి, నాగం గారి వాదన కరెక్ట్ అని రాసి ఫైల్ ని ముందుకు పంపించిన చంద్రబాబు ని కూడా అభినందించాల్సింది.
తెలుగు దేశం ముక్యమంత్రుల సమయములో ముక్యమంత్రులకు తెలీని కొన్ని సమయాల్లో అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చు కాక, కాని తమ ద్రుసితికి వచ్చినవి సరిదిద్దారు అని చెప్పటానికి ఇది ఉదాహరణ.
ఇంటర్వ్యూ మొత్తం లోకూడా చంద్రబాబు ఉత్తరం ఇవ్వలేదు అనే గొడవ తప్ప ఇంకే గొడవ లేదు అని కూడా అంగీకరించారు. తప్పుని ఒప్పుకోవాలి, ఒప్పుని కూడా ఒప్పుకోవాలి. కేంద్ర ప్రబుత్వం రెండో సరి లేక ఇవ్వమని అడగలేదు. తెలుగు దేశం ఇచ్చిన లేఖని వెనక్కు తీసుకున్నది లేదు. అన్ని పార్టీలను కలిచి, శ్రీ కృష్ణ కమిషన్ వేసిన తరువాత మల్లి ఈ పార్టీ మీటింగ్స్ ఏంటి. దానికి కట్టిన డబ్బుల లెక్కలు ఎవరు చూస్తారు, ఎవరు ఇస్తారు.
Watch from 24.34 to 26.02.
http://www.youtube.com/watch?v=UYjKWKfgCzQ&feature=youtu.be
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.