రాజకీయాలు నాయకులకి వోదులుదాము
మనము ప్రజలము ఆలోచిద్దాము.
కుక్క తోక పట్టుకుని గోదారి ఇదొచ్చు, కనీసం కుక్క ఇధకపోయిన తను మునగకుండా మనల్ని ముంచదు అని మనకు నమ్మకం. విశ్వాసం దాని లక్షణం. ప్రతి మనిషిని నమ్మాల్సిన పనిలేదు, కానీ ఎవరో ఒకరిని నమ్మాలి అనుకోవటం ముర్కత్వం.
మొన్న పోలవరం టెండర్స్ విషయము లో తెరాస మాకేమి సంబందము, మా పత్రికలో పెట్టుబడి దారుడికి ఆ టెండర వస్తే అని వాదించింది దానికి మన మిత్రులు కూడా పత్తాసు పలికారు. ఒక ఉద్యమ స్పూర్తి గల పార్టీ తమ లక్షణాలను తమ వైపు ఉన్న నిజాన్ని జనాలకు చెప్పటానికి పెట్టుకున్న పత్రికలో పెట్టుబడులను తీసుకునేటప్పుడు, ఆ పెట్టుబడి దారుడు తమ లక్షణాలకు సహేతుకంగా ఉంటాడ లేదా అనేది చూసుకోవాల్సిన కనీస అవసరం ఉంది అని కూడా వాళ్ళు ఆలోచించకపోయినా మనం ఆలోచించాలి. కాదంటారా.
రాష్ట్రము లో 2009 ఎన్నికల సమయములో మహా కూటమి అని పోరడు ఒక వేదిక మిధ ఎన్నికలకి వెళ్ళిన తెరాస, తెలంగాణ ఎన్నికలు అయ్యిన మరుసటి రోజే, పంజాబ్ కి పయనం అయ్యి, NDA తోనే తెలంగాణ అంటూ BJP తరుపున ప్రచారం లో పాల్గొన్న కెసిఆర్ గారు, ఇప్పుడు తెలంగాణ అంటే మైనారిటీ కూడా అంటూ కొత్త రాగం అందుకున్నారు. పైగా ఒక మైనారిటీ అబ్యార్ధిని మహబూబ్నగర్ లో పోటి చేయించి, మేము మైనారిటీ ల వెమ్మట ఉంటాము అంటూ దానినే పెద్ద ఎన్నికల అస్త్రం గా చేసుకుని వోడిపోయారు
సకల జనుల సమ్మె అంటూ ప్రొఫెసర్ గారిని ముందు ఉంచోపెట్టి వాడుకుని, జాక్ లో ఉన్న ఒక్కో పార్టీ ని పక్కకి పంపిస్తూ, జాక్ అంటే తెరాస లాగా ముద్రించి ఇప్పుడు BJP ని పక్కన పెట్టటానికి మనము తెచ్చిందే జాక్, వాళ్ళు మన మాట వినకుండా వాళ్ళ మాట మనం వినటం ఏంటి, మనము ఏది చెప్తే అదే వేదం గా బావిన్చాల్సిందే అని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.
పదేళ్ళ నుంచి నానుతున్న ప్రశ్న మల్లి మల్లి అడగాల్సిన అవసరం ఉంది. తెరాస కి కావాల్సింది తెలంగాణ నా, అయితే ఈ వ్యవహారాలు చూసి ప్రజలు ఆలోచించరు అనేది వారి భావనా. అసలు ప్రజలు ఆలోచిస్తున్నారా. లేకపోతే ఎప్పటికైనా KCR తోక పెరగదా, మేము కట్టిరించక పోతామా అని నిరిక్షిస్తున్నారా
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.