Powered By Blogger

Sunday, June 24, 2012

Politics and Blackmail - which one follows what and HOW?


రాజకీయాలు బ్రస్తుపట్టాయి అంటే ఏంటో అనుకున్న, అవి బ్రస్టు పట్టలేదు అని గట్టిగ అరవాలి అనుకున్న, facebook ఇంకా ఆ అవకాసం ఇవ్వలేదు కాబట్టి, అవి బ్రస్టు పట్టలేదు, కేవలం బలహీనతలను కప్పి పుచ్చుకోతనికి చేసే ప్రక్రియ అంటే BLACKMAIL రేంజ్ కి దిగజారాయి.

ప్రత్యూష హత్య కేసు లో ఇరుక్కున్న కొడుకుని రక్షించుకోటానికి దేవేందర్ గౌడ్ గారు సొంత పార్టీ పెట్టారు, తరువాత ప్రజారాజ్యం లో చేరి తెలంగాణ లో తెలుగు దేశం బలహీనం అవ్వటానికి దోహద పడ్డారు.

తన ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో ఇరుక్కోకుండా కే కేశవ రావు గారు, మన మాజీ మహా నేత గారు ఏది చెప్తే అదే సబబు అనేలా రాగం ఎన్నుకున్నారు.

అనంతపూర్ లో పరిటాల రవిని చంపటానికి ప్రయత్నం చేసిన మంగళ కృష్ణ ని బొక్కలో కొడితే తమ కొడుకు గురించి నిజం చెప్పేస్తాడు అని మన మాజీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ లో కృష్ణ మంచి కుర్రాడు, అతడిని ఎన్ని రోజులు విచారించిన 3rd డిగ్రీ మాత్రం వాడకండి అని బుకాయించారు.

మొదట సారి గెలవగానే మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన మహా నేతని ఇబ్బంది పెడితే తన పదవికే ఇబ్బంది అని బెదిరించాగానే మోపిదేవి గారు ఆగమేఘాల మిధ హైదరాబాద్ కి వచ్చి చెప్పిన చోట అల్లా సంతకం పెట్టారు.

తండ్రి పోయిన రోజే తానూ కాక ఎవరన్నా ముఖ్యమంత్రి అయితే కర్ణాటక గాలి కబుర్లు, తన వ్యాపార సామ్రాజ్యము నిజాలు తెలుస్తాయి, గాలోడు, ఇంతక ముందు వాడుకున్న అధికారులు నిజాలు చెప్తే తనకు ఇబ్బంది అని గ్రహించిన యువ నేత ముఖ్యమంత్రి పీతం కోసం ఢిల్లీ లెవెల్లో బెదిరింపులు.

జగన్ ఆస్తుల జప్తు కేసు లో తానూ సంతకం చెయ్యకపోతే, ఇప్పటికే బొక్క లో ఉన్న భాను తన ముద్దుల కొడుకు నేర చెరిత్ర చెప్తాడు ఏమో అని బెదిరి మహా నేత కుమారుడు, తన మేనల్లుడి ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిన మన మంత్రి సబితమ్మ.

నేనే ముఖ్యమంత్రి, నేను కూడా అవుతాను ముఖ్యమంత్రి అని చెప్తున్న బొత్స గారిని ఇరుకున పెట్టటానికి ఒకే దెబ్బతో అందరిని దారిలోకి తేవాలి అని మద్యం మాఫియా పై దాడులు అని రచ్చ చేస్తున్న మన ముఖ్యమంత్రి. 

తెలంగాణ లో మేము గెలుస్తే నే తెలంగాణ మిధ సెంటిమెంట్ ఉన్నట్టు, మిగిలిన వారు ఎవరు గెలిచినా ఉపయోగము ఉండదు, మాకున్న 2 పర్లిఅమేంట్ సబ్యులు పార్లిమెంట్ కి వెళ్ళిన ఫారం హౌసు కి వెళ్ళిన మా తోనే మేరు ఉండాలి, మేము చెప్పిందే వినాలి అనే తెరాస బెదిరింపులు. 

నేను పైన BLACKMAIL అన్నాను కాని ఇలాంటి వాల్లనే ఎన్నుకోవాలి అనే అతి పెద్ద బలహీనత తో నిత్యం BLACKMAIL కి గురయ్యేది మన ప్రజానీకమే. లేకపోతే మన కర్మ కాకపోతే మనకు ఈ బలహీనతలు కల వారు నాయకులూ అవ్వటం ఏంటి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.