Powered By Blogger

Sunday, June 24, 2012

Congress HIGH COMMAND - Thoughts


జైలు లో ములన కుర్చుని, బయటకు వస్తే ఎండల్లో తిరగాల్సి వస్తుంది ఓడితే బాద్యత వహించాల్సి వస్తుంది అని అమ్మ చెల్లిని రోడ్లేమ్మట తిప్పుతున్న యువనేత గురించి నిజాలు రాసి రాసి చిరాకు వస్తుంది. అవి నిజాలు అని నేను నమ్మినట్టే, అవే నిజాలు అని జగన్ బాబు అభిమానులు కూడా నమ్ముతున్నట్టే కనిపిస్తుంది. ఎవరు మేము తప్పు చెయ్యలేదు అని కలర్ ఎగరేయ్యట్లేదు. పైగా మేరు చెయ్యలేదా అని డిఫెన్సు లోకి పోతున్నారు. కాబట్టి ఈ తంత్రానికి కారణం అయిన కాంగ్రెస్ మిధ వేద్దాము ఈ సారి.

ఢిల్లీ లోని సోనియా గారు, ఆంధ్ర లో జరుగుతున్నా అపకారానికి దారి అని ఒక్కో తప్పు చేసుకుంటూ పోతు ఎటు పోతున్నారో తెలీకుండా కాంగ్రెస్ శ్రేనులని దిగజార్చారు.

ఆజాద్ గారు వచ్చారు, ఒక్కో సారి ఒక్కో విధంగా మాట్లాడుతూ అసలు ఏమి చెప్పాలి అనుకున్నాడో తెలీకుండా వచ్చాడు, వెళ్ళాడు పద్దతిలో నడిపెస్తున్నాడు రాజకీయాన్ని. ఒక రోజు, జగన్ బాబు కాంగ్రెస్ లో ఉంటె ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటదు, ఇంకో రోజు కాంగ్రెస్ లో ఉన్న సిక్షర్హుడే అంటాడు, మల్లి వెమ్మటే, కాంగ్రెస్ లో ఉంటె ఈ తిప్పలు ఉండేవా అంటాడు. ప్రజలు చూడటానికి కూడా పెద్ద స్టార్ కంపైనేర్ కాదు కదా, అసలు ఇతడు చెప్పింది ప్రజలకు అర్ధం కూడా కాదు, పోనీ తోడూ వచ్చిన వాడు అయిన తెలివిగా మేనేజ్ చేసి తెలుగులో మామ అనిపిస్తే ఓ మాదిరిగా అన్న ఉండేది, అది చెయ్యలేదు.

పోయిన బై ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఈ సరి కొంత గట్టి అబ్యార్దులనే పెట్టింది కాంగ్రెస్. ఒకప్పుడు పార్లమెంట్ కి పోటి చేసే మాగంటి పార్వతమ్మని ఒంగోలు అసెంబ్లీ కి పోటి చేయించింది. విశాక లో గెలిచే సుబ్బిరామి రెడ్డి గారిని నెల్లూరు కి వేసింది, తెలుగు దేశంలో చాల పదవులు అనుభవించిన మంత్రి కొత్త పల్లి సుబ్బారాయుడు ని నరసాపురంకి, ఒకప్పటి తెలుగు దేశం నాయకుడు తోట త్రిముర్తులుని రామచంద్రాపురం, మంత్రి గారి తమ్ముడు ని నర్సీపట్నం. కొంత అధిష్టానం కొంత మన బొత్స బాగానే కస్టపడి సాదిన్చేద్దము అనే తత్త్వం కనపడుతుంది.

ప్రజలకు ఎన్ని నిజాలు చెప్పిన అవి చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే వింటారు. మందు సుడిగుండంలో ఇరుక్కుని, వోల్క్స వాగోన్ కుంబకోణం లో అమాయకంగా డబ్బులు పోనాయి ఏటి సేత్తం అని చెప్పిన బొత్స గారు, కూతురి మంచం కింద 35 కోట్లు దొరకగానే ఢిల్లీ కి వెళ్లి బేరాలు నడిపి, ఒకటి తరువాత ఒకటి తప్పులు చేస్తూ నోరు కరుచుకునే అన్నయ్య, ఏది చేసిన ఒక అడుగు ముందుకు వేస్తె, రెండు అడుగులు వెనక్కి వేసి మల్లి అటు ఇటు కాకున పోతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని నిజాలు చెప్పిన ప్రజలు పట్టించుకుంటారా, వాటిని వోట్ల పండగ రోజు గుర్తు పెట్టుకుంటార.

ఇవన్ని అనుమానాలే. ఇలా కాదు, మేము పార్టీ ని మల్లి కడిగేసుకుని రాష్ట్రము లో మల్లి పున్జుకుంతం అని నమ్మకము ఉంటె, ఎవ్వల జగన్ బాబు ని పెట్టిన జైలు లోనే పక్కన మోపిదేవిని పెట్టినట్టు, సబితమ్మను, ధర్మానను, పొన్నాలను, ఈలా తప్పులు చేస్తూ దొరికిన ప్రతి ఒక్కడిని మన చేర్లపల్లికి రావణ చేయించి, మేము మల్లి ఎన్నికల్లో నిజాయతి గ ఉంటాము అల ఉన్న వాళ్ళకే సీట్లు ఇష్టము అని ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో కాకపోయినా రాబోయే ప్రతి ఎన్నికల్లో చాల ఉపయోగము.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.