దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయి అని చెప్పిన గురజాడ గారు, మనుషులు ఆలోచన లేకుండా పోతారు అని గ్రహించలేదు అనే అనుకోవాలి. బాద్యత లేని ప్రజలు, దేశాన్ని తాయారు చెయ్యలేరు అనేది మనము రోజువారీ రుజువు చేస్తున్నాము. మన రాజ్యాంగము, మన చట్టాలలో కొన్ని లోపాలు ఉన్నా, ఎక్కువ పాళ్ళు బాగానే రాసారు కాబట్టి కొంత లో కొంత అయిన న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతో హాయిగా నిద్రపోగలుగుతున్నాము. మనము చేసే తప్పులు తెలుసుకోకుండా ఇంకా కొన్ని కొత్త తప్పులు చేసుకుంటూ పోవటమే గొప్ప అనే స్తాయికి చేరిపోయము.
బాద్యత లేని మనుషుల ఆలోచనా సరళి లో లోపబుయిస్టంగా ఉంటుంది. మన కులమా, మన మతమా, మన భాషేన అనే ఆలోచనే తప్ప ఇతని గుణం ఎలాంటిది, ఇతని వాళ్ళ మన సమాజానికి ఎమన్నా ఉపయోగము ఉంటుందా అనేది ఆలోచించకుండా జీవితాన్ని సాగదిస్తూ పోతున్నామే తప్ప, మన ఆలోచనా సరళిని మార్చుకోటానికి ప్రయత్నించట్లేదు.
మన నాయకులే మనల్ని ఎలా ఆలోచించు కోవలో కూడా దిశానిర్దేశం చేసేస్తున్నారు.
పాకిస్తాన్ మంచి దేశం కాదు, మనకు శత్రు దేశం.
హిందువులు ముస్లిం సోదరులని నమ్మకూడదు.
అగ్రవర్ణాల వారు అంటారని వాళ్ళను నాయకులూ గా ఒప్పుకోకుడదు.
ఒక కులం వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళకే వోట్లు వేసుకోవాలి.
ఒక నియోజకవర్గం వారు తమ అవసరాలే తప్ప పక్క నియోజకవర్గాల అవసరాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
మా నాయకుడికి సత్తా ఉంటె, మన నియోజకవర్గం లో పనులు అవుతాయి.
పక్క పక్క రాష్ట్రాల వారు, తమ ప్రాంతపు ప్రజల అవసరాల కనుగుణంగా నది జలాల వాటాల కోసం పోరాడాలి.
ఇలా మనలో మనమే చాల చిన్న చిన్న భాగాలుగా విడిపోయి ఇంకా మనది ఒక దేశం, మనమందరమూ అన్న దమ్ములము అని చెప్పటం దండగేమో.
వీటన్నిటికి కారణం, మన చట్టాలు, రాజ్యాంగం లో ఉన్నా చిన్న చిన్న లోపలే. ఒక్క నిటి సమస్యనే చూసుకుంటే, మన రైతాంగం కి కావలసినంత నిరు ఉంటె, రాష్ట్రాల మధ్య నిటి గొడవలు ఉండాల్సిన పనిలేదు. ఆ ఉన్నా నీటిని, సక్రమముగా ప్రతి ప్రాంతానికి అవసరాల రిత్య ఒక పెద్దమనిషి ఒప్పందము ప్రకారం ఇస్తే ఇంకా ఈ గొడవ సమసిపోతుంది కదా. ఆ దిశలో ప్రయత్నం చెయ్యకుండా, సుప్రీం కోర్ట్ అంటూ కోర్ట్లు చుట్టూ తిరుగుతూ, అటు ప్రాంతం వాళ్ళని ఇటు ప్రాంతం వాళ్ళని మోసం చేస్తూ సమయాన్ని గడిపెస్తున్నాము.
కావలసినంత నిరు ఉంటె నిటి పోరాటాలు లేనట్టే, మన సమాజం లోకూడా కావలసినంత సంపద ఉంటె ఈ కుల గొడవలు, ప్రాంత గొడవలు కూడా ఉండవు. రోజువారీ గొడవలు పెట్టుకుంటూ ఇంకా మన దేశం, మనము గొప్ప అని చెప్పుకోవటము అనవసరము.
మన చట్టాల్లో ల్యాండ్ సీలింగ్ ఆక్ట్ ఉంది, అలాగే ఒక్కో మనిషికి ఇంతకంటే ఎక్కువ సంపద ఉండకుడదు అని ఒక ఆక్ట్ పెడితే అత్యాస ఉండదు కదా, ఇంతకంటే ఎక్కువ సంపాదించలేను అని కొందరు గొప్పవారు పక్క దేశాలకు పోయిన, మన దేశం లో ఉన్నా వనరులు సరిగ్గా వాడితే ఆ మాత్రం గొప్ప వాళ్ళని తాయారు చేసుకోవటం కష్టం కాదు, మనకు ఉద్యోగాలు రావటము కష్టం కాదు. మనము ఎన్నుకునే మా రాజులూ ఇలాంటి ఆలోచనా చెయ్యరు, లేని స్వర్గాన్ని మనకు చూపిస్తారు, మనము నిద్ర నటిస్తూ నరకం అనుభవిస్తుంటాము.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.