అసలు రాజకీయ నాయకుడు అనేదే కొన్ని రోజుల్లో భుతూ పదం అవుతుంది. రాజకీయ సేవకుడు అనే పిలవాలి. ప్రతి ఒక్కడు మా జగన్ బాబుని ఇబ్బంది పెడుతున్నారు, మీ బాబు తినలేదా అని వెనకేసుకుని వస్తున్నారు, అసలు ఆ విసాల హృదయానికి ధన్యవాదాలు చెప్పలా, లేక మృదువుగా బుద్దులు చెప్పాలో కూడా తెలియట్లేదు. మనం ఒక దేశం, మనకు కొన్ని చట్టాలు అనేవి పెట్టుకునేది ఐలాంటి దోపిడిని అరికట్టటానికే, అల అరికట్టని చట్టాలు వ్యర్ధం.
నాయకులూ తింటారు అనేది మనం కాదనలేని నిజం. కాని తింటే తప్పేంటి అనే స్తాయికి ప్రజలు దిగజారటం, అది చదువుకున్న సోదరులు కూడా సమర్దించటం దివాలాకోరుతనానికి నిదర్సనం. ఈ వ్యాధి ఇలాగే ప్రబలితే మనము మల్లి స్వతంత్ర పోరాటం చేసిన పెద్దగ ఫలితం ఉండదు. మన రోజువారీ యుద్దలని కొంచం పక్కన పెట్టి మనల్ని అందరిని ఉమ్మడిగా దోచుకుంటున్న ఈ నాయకుల పై రోజుకు ఓ 5 నిముషాలు ద్రుష్టి సారిస్తే, మనం ఇంత కస్టపడి పనిచేయ్యల్సిన అవసరం ఉండదేమో.
మనం ఎక్కాల్సిన బస్సు, బస్సు స్టాండ్ కి 50 మీటర్ల దూరంలో ఆగదు.
మన పిల్లలు ఆడుకోటానికి మన కాలనీ లోనే చిన్న పార్క్ వస్తుంది.
మన రోడ్లు శుబ్రంగా ఉంటాయి. చెత్త పేరుకుపోయి వచ్చే రోగాలు రావు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం 5 నిముషాలు ఆలోచిస్తే, మన దేశం రూపు రేఖలే మారిపోతాయి. రోగాలు తక్కువ, చదువులకు తక్కువ కర్చు అనే నమ్మకం వస్తే మన బావితరాలకు ఎప్పుడే సంపాదించాలి అనే కోరికే మనకెందుకు. తినటానికి తిండి దొరుకుతుంది, చదువుకోటానికి బడి, రోగం వస్తే వైద్యశాల అందుబాటులో ఉంటె మనకు దైనందిక జీవితంలో చింత అవసరమా.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.