Powered By Blogger

Thursday, May 24, 2012

కులము అనే గంట మెడలో వెయ్యాలి అంటే కాంగ్రెస్ వల్లే వెయ్యాలి.





కులము అనేది మేడలో గంట లాంటిది. అది ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. ఒక పక్క ఆకర్షిస్తూనే చెవులకి మనసుకి ఆలోచన పుట్టిస్తుంది, ఈ గంటని కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ మోగించారు, ఢిల్లీ లెవెల్ లో రాహుల్ గాంధీ గారు నేను బ్రహ్మిన్ ని అని, రాష్ట్రము లో కాంగ్రెస్ వారు జగన్ రెడ్డి కాదు క్రిస్టియన్ అని. రాజా రెడ్డి గారు క్రిస్టియన్ గా మారినప్పుడు రాజశేఖరుడు బోర్న్ క్రిస్టియన్ అవుతాడే తప్ప హిందువు అవ్వడు అనేది నిజం. ఆ తరువాత వారు ఎవరు హిందూ మతం కి చెందినా వారు కారు. కాని మన రాజ్యాంగం మనకు ఏ మతమ అయిన తీసుకునే అవకాసం ఇచ్చింది, పైగా ఆ మతమ వాడు అని అనకూడదు అని నిబందన కూడా పెట్టింది.

మనము మారితే మన పిల్లలు, వారి పిల్లలు కూడా ఆ కొత్త మతానికి చెందుతారు అనే దానిలో అనుమానం లేదు అలాగే మత మార్పిడులు కుదరని హిందూ మతంలోకి ఎవరు మారలేరు కూడా. నాకు తెలిసి మనకు హిందూ మతం ఆ అవకాసం ఇవ్వలేదు. అందుకే ఇందిరా గాంధీ ని పూరి దేవస్తానం లోకి ప్రధాని గా ఉన్నప్పుడే రానివ్వలేదు. ఈ గంటలు కట్టే వ్యవహారం లో సిద్ద హస్తులు మన కాంగ్రెస్ నాయకులూ. వాళ్ళు చేసి పనిని వాళ్ళకే వదిలే ప్రజలను తెలుగు దేశం వైపుకు "EMOTIONAL " గా మార్చుకునేందుకు ప్రయత్నించండి. అది సత్ఫలితాన్ని ఇస్తుంది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.