Powered By Blogger

Thursday, May 24, 2012

జగన్ బాబుకి ఒక లెక్క ఉంది, ఆ లెక్క చూసే వాళ్ళకి చెర్లపల్లి లో చిన్న బొక్క ఉంది.




జగన్ బాబు లెక్కలు చూసే ప్రతి ఒక్కడు కృష్ణ జన్మస్తానాన్ని వెతుక్కుంటూ వెళుతున్నాడు. బినామీ లెక్కలు చూస్తూ పక్క రాష్ట్రములో మంత్రిగా పనిచేసిన గాలి చెర్లపల్లి జైలులోనే ఉన్నాడు. ఆడిటర్ అంటూ సాక్షి మీడియా లెక్కలు చూస్తూ, పెద్దాయన తో పరిచయం వల్ల పదవులు పొందిన విజయ సాయి రెడ్డి గారు గిమ్మిక్కులు చేసి బయటకు వచ్చిన వారం లోపే మల్లి వెనక్కి వెళ్ళాడు. ఫాక్టన్ లెక్కలు చూస్తూ కావాల్సిన వాళ్ళకు మందుగుండు సామాన్లు సరఫరా చేస్తూ, నచ్చని వారిని చంపుతూ, సెటిల్మెంట్లు చేసే మంగలి కృష్ణ కూడా జైలుకు చేరాడు.

ప్రతి కేసలోను "A2 నిందితుడిని" ని పట్టుకుంటూ మన A1 స్టార్ ని వదిలేస్తున్నారు ఏంటో. ఎన్ని లెక్కలు తేలితే A1 చొక్కా పట్టుకోగాలవు మన చేట్టాలు. నాయకుల బలహినతలనుంచి ఎప్పుడు బయట పడతారో న్యాయం మల్లి ఒక్క పాదం మీదకు ఎప్పుడు తెస్తారో.

అసలే 2012 లో ప్రపంచం అంతమవుతుంది అని ప్రచారం జరుగుతుంది. న్యాయాన్ని కుంటుతున్న ఆ ఒక్క పాదం మిదనన్న ఉండనివ్వండి, ప్రపంచ సమాప్తిని నిరోదించండి. ప్రపంచం అనేది ఉంటె కదా మన అధికారం ఉన్నా, ఎమన్నా అనుభవించాలి అన్న.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.