మన రాష్ట్ర ఎన్నికల్లో డబ్బు, మతము, కులము తరువాత గుణము అనేది మనకు తెలియని విషయము కాదు. చంద్రబాబు నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు ప్రభావము బాగా పెరిగింది అని చెప్పగానే, చాల మంది అదేదో మేము మేధావులము, మేము అనాలి కాని అయన అనటం ఏంటి అని మొదలెట్టారు.
జయ ప్రకాష్ నారాయణ గెలిచినా కుకట్ పల్లి నియోజకవర్గం ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గం లో భాగమే. ఖైరతాబాద్ నియోజకవర్గం లో మాజీ సిబిఐ డైరెక్టర్ విజయ రామారావు గారిని ఉంచో పెట్టి జయప్రకాశ్ నారాయణ కంటే 10 సంవత్సరాల ముందే డబ్బు కర్చు పెట్టకుండా తెలుగు దేశం టికెట్ పై గెలిచిన సంగతి తెలియనిది కాదు.
రాష్ట్రము లోనే కాకుండా దేశం లోనే అత్యంత ఆస్తి పరుడైన గుడిసెల వెంకట స్వామి పైన dr సుగుణ కుమారిని పోటికి పెట్టి పార్లిమెంట్ కి పంపించిన ఘనత తెలుగు దేశానిది కాదా. వరంగల్ జిల్లా లో అత్యంత ఆస్తి పరుడైన సురేందర్ రెడ్డి పైన అజ్మీర చందూలాల్ ని పోటి పెట్టి గెలిపించింది తెలుగు దేశం కాదా.
అనంతపురం లో విలేఖరి కలువ శ్రీనివాసులు, ఆదిలాబాద్ లో పనిచేసుకునే గౌరీ శంకర్ రావు ని మాజీ కేంద్ర మంత్రి ప్రదీప్ చందర్ దేవు మిధ పోటి పెట్టి గెలిపించింది తెలుగు దేశం కాదా.
ఈ రాజకీయాల్లో డబ్బు కులము మతము పెరుగుతున్నాయి అని కొన్న వస్తువు పై సరిగ్గా పన్ను కట్టని నేను చెప్తే మేధావి అంటారు, రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసి ప్రధాన ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబు అంటే దెప్పి పొడుస్తున్నారు.
ఇవ్వాల్టి రోజున మన రాష్ట్రము నుంచి కేంద్రానికి MP అంటూ వెళ్ళినన వాళ్ళు అందరు డబ్బులు కల వారు కాదా, డబ్బులు కర్చు పెట్టకుండానే వెళ్ళారా. ఆంధ్ర ప్రదేశ్ లో డబ్బులు కర్చు పెట్టకుండా గెలిచిన ఒక్క నియోజకవర్గాన్ని చూపించండి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇది ఆలోచించాల్సిన విషయము, అని ముందుకు వస్తే మతాల యుద్దమా.
డబ్బులేకుండా రాజకీయం తెలుగుదేశం చేసింది, చేస్తుంది, చెయ్యగలదు కూడా.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.