ప్రజలకు రేపు చూపించి ఇవ్వాల దోచటం నాయకత్వ లక్షణమా
సముద్రంలో తేలికగా నడిచే నావ చిన్న చిన్న కాలువలో తడబడుతుంది. అల తడబడగానే ఈ నావ పడితే మన గతేమి కాను అనుకుని కొంత మంది కిటికీలలోనుంచి దూకేస్తారు, కొందరు సముద్రాన్ని యిదిన ఇంత పెద్ద నావకి ఈ చిన్న కాలువలు ఒకలేక్క అని నిబ్బరముగా ఉంటారు. రాజకీయాల్లోకి కేవలం గెలవటం ప్రజల నెత్తిన ఎక్కటము అని నమ్మే వాళ్ళకి తెలుగుదేశంలో ఇప్పటి పరిస్తితుల్లో ఇమడటం కొంచం కష్టమే అవుతుంది, మరి ముఖ్యంగా మంత్రులుగా, చట్ట సభలకు ఎన్నిక కాకుండా పెద్దల సభ మీదనే నమ్మకము పెట్టుకుని పార్టీ ఇచ్చే పదవులపైన ఆధారపడే నాయకులకి.
కొన్ని సందర్భాలలో ప్రజలు తమకు కావాల్సిన వాదానికి వోట్ వేసుకుంటారు, అది ప్రజల దృష్టిలో సభాభే, కాని ఆ వాదానికి పట్టులేదు, ఎన్ని రోజులని రేపు మాపు అని చెప్పే నాయకులని నమ్ముతాము, అసలు ఈ కబుర్లు చెప్పే నాయకులకి అయిన తెలుసా రేపు ఎలా ఉంటుందో, మనము నమ్ముకున్న నాయకత్వానికి అంతటి పరిపక్వత ఉందా అనే ప్రశ్న ప్రతి ఒక్కడు కొన్ని రోజులకి వేసుకోక తప్పదు. ఇది దేశం లో బలంగా విచిన కమ్యునిజంకే తప్పలేదు.
ప్రజల్లో ఆకాంక్ష ఉంది, దానికంటే ఎక్కువగా తెలంగాణ వస్తే మన పిల్లలకు ఏదో జరుగుతుంది అనే ఆస ఎక్కువ ఉంది, అది పిట్టల "దొర" చెప్పే మాటలతో పెరుగుతూ తరుగుతూ ఉంది. ప్రజలకు రేపు చూపించి ఇవ్వాల దోచటం నాయకత్వ లక్షణము అయినప్పుడు ఐలాంటివి మాములే. కాని ప్రజలు తెలివి తక్కువ వారు అని ఉహించటము అవివేకమే.
మొన్న ఎన్నికల్లు నాయకులూ చెప్పిన కోన్నివిషయాలను ప్రశ్నించటం మొదలు పెట్టారు. మైనారిటీస్ కి ఉప ముక్యమంత్రి అని అన్న నాయకుడు ఆ మైనారిటీ కి చెందినా నాయకుడిని గెలిపించుకోటానికి చేసిన ప్రయత్నాన్ని కనిపెట్టారు. ఎన్నికల్లో లబ్ది కోసం నిసిగ్గు గా మేము మైనారిటీని నిలబెట్టాము గెలిపించండి అని మతాల చిచ్చు రేపిన సంగతి తెలంగాణ జాక్ సబ్యులు మరుస్తారు అని నేను అనుకోవటం లేదు. వోడిన మైనారిటీ అబ్యార్ది, ఇక్కడ తెలంగాణ వాదం కంటే మత వాదమే గెలిచింది అని ప్రకటించటము చూసాము. కోన్ని ప్రాంతాల్లో మైనారిటీ వాడిని కావాలనే నాయకులు, తెలంగాణ జాక్ సబ్యులు వోడించారు అని వచ్చిన వాదనని చూసాము, రాజకీయ అభిలాష లేని తెలంగాణ జాక్ ఒక నియోజకవర్గం లో ఎ నిర్ణయము తీసుకోకుండా రెండు కాళ్ళ సిద్దాంతాన్ని పాటించటము చూసాము.
చూడటము ప్రజలకు తెలుసు, ఆ చుసిన దానిపైన అవగాహనా పెంచుకోవటము తెలుసు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.