Powered By Blogger

Wednesday, July 13, 2011

Kuppam lo chandrababu, tama arthanadhalu cheppukodalichina JANAM.

అసలు జనం ఎందుకు వచ్చారు, తమ గోడు చెప్పుకుందాము అనా, లేక తమతో ఉండి తమ కష్టాలు పట్టించుకుని, వాటిని చట్టసభల్లో వినిపించి, తమ కష్టాలను తీర్చి అక్కున చేర్చుకున్న నాయకుడిని కలవటానికి వచ్చారా. రెండవది అయితే నిస్సందేహంగా కాదు, చంద్రబాబు గారే, ప్రబుత్వం తన నియోజకవర్గం పై కక్ష సదింపు చేర్య చేపడుతుంది అని అనేవారు కాదు. పోనీ కష్టాలు చెప్పుకోటానికి వచ్చారు అనుకుంటే, భారి ఉరేగింపుగా నాయకుడు వెళ్తుంటే, అది సాధ్యం కాదు. అసలు నాయకులూ భారి ఊరేగింపులు చెయ్యాల్సిన అవసరం ఏముంది. విళ్ళు పక్కన ఉన్న శ్రీలంక లేదా పాకిస్తాన్ లో భుబాగాన్ని ఎమన్నా గెలుచుకున్నారా, లేక, వారికంటే, మన దేశాన్ని ముందుకు నడిపించి ఎమన్నా సాదించారా.

ఉరేగింపుగా వెళ్ళాల్సిన అవసరం అసలు నాయకులకు ఏముంది. ఊరేగింపులకు అనుమతులు ఎ ప్రాతిపదికన ఇస్తారు. ఎన్నికల సమయం లో ఊరేగింపులకు కూడా, ప్రబుత్వం కూడా ప్రైవేటు ఆస్తులలో కార్యక్రమం చేసుకోటానికి అద్దె చేల్లిన్చినట్టే, పబ్లిక్ ఆస్తులకి కూడా కొంత అద్దె అనేది ప్రకటించి, దాని ప్రకారం వసూలు చెయ్యటం అవసరం. ఈ ఊరేగింపుల కారణముగా ఈ కూడలి లో ఎంత సేపు అంతరాయం ఏర్పడుతుంది అనేది లెక్కించి కనీసం పదిరోజులకు ముందే ప్రయాణికుల సౌకర్యం కోసం ఆ కూడలిపై నోటీసు అతికించాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి ఊరేగింపులు చేసే నాయకులే ఆ ప్రాంతాల్లో జనాలకి జరిగే అసౌకర్యానికి కూడా బాద్యత వహించి, దానివల్ల ప్రజలకు కలిగే భారాన్ని మొయ్యాలి, దానివల్ల జరిగే ప్రాణ నష్టాలు నాయకులే బరించాలి.

ఉద్యమం మా హక్కు అనే నాయకులకు కూడా దీనిని వర్తించాలి. ప్రతి పట్టణానికి పట్టాన సివరులలో, ఒక మైదానం ఏర్పాటు చేసి, ఈ ఉద్యమం అయిన, నాయకుల ప్రసంగం అయిన అక్కడే చేసుకునేటట్టు, నియమం పెట్టాలి. ప్రజల దైనందిక అవసరాలను ఇబ్బంది పెట్టి, ఉద్యమాలు చేసి సాదించేది ఏమిటి.

మనవ హక్కుల సంగం వారికీ బాద్యత అప్పచెప్పి, ఈ ఉద్యమానికి అయిన వారు, ప్రబుత్వముతో మాట్లాడే హక్కుని ఇవ్వాలి, అల చేసిన యెడల, మనవ హక్కుల వారు ప్రబుత్వానికి సలహాదరి పాత్ర వహించిన వారు అవుతారు. ఇది శాసన మండలి చేసిన యెడల ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉన్న శాసన మండలి, ప్రబుత్వానికి ఒక్క సలహా ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ నిరుద్యోగులకి పదవులు ఎవ్వతనికే పనికివచ్చినది.










No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.