Powered By Blogger

Wednesday, September 5, 2012

Caste, Religion, Region, Party, Nation, what should concern us?

ముసుగు వేసుకున్న ప్రతి ఒక్కరు పత్తిత్తు కాదు

ముసుగు తీసేసిన ప్రతి ఒక్కరు పతిత కాదు.


మనమందరమూ ఏదో ఒక ముసుగు వేసుకునే వాళ్ళమే, దొరికిన పక్కనోడిని అట పట్టించే వాళ్ళమే. మనలో 
కొందరికి కులం ముసుగు
కొదరికి మతం ముసుగు
కొందరికి ప్రాంతం ముసుగు
కొందరికి పార్టీ ముసుగు
కొందరికి రాష్ట్రము ముసుగు
కొందరికి దేశం ముసుగు.

1990 లో నాకు క్రికెట్ మిధ అభిమానం అంటే దేశం మిధ అభిమానము అని భావించే రోజుల్లో జరిగిన సంగటన. నాకు KPHB లో ఒక ముస్లిం మిత్రుడు ఉండేవారు. (పేరు అప్రస్తుతం, నాకున్న మిత్రుల్లో చాలా మంది ముస్లిం మిత్రులే). అతనిది గుంటూరు జిల్లా, నేను పుట్టి పెరగటం హైదరాబాద్, అందున తెలుగు వాళ్ళు ఇష్టపడేలా పక్క పాపిడి కాకుండా మద్య పాపిడి తియ్యటం వల్ల కాబోలు, చిన్నప్పటి నుండి ఉన్న స్నేహితల వల్ల కాని నాకు వచ్చిన ఉర్దూ ఉచ్చారణ కాని మాట్లాడే పద్దతి కాని మిత్రుడికి లేదు. నా పేరు చెప్పే వరుకు నన్ను హిందువు అనుకునే వాల్లు కూడా తక్కువే. అలాగే నాకంటే నా మిత్రుడికి తెలుగు కూడా ఒక పిసర బాగానే వచ్చేది అనేది నేను కాదనలేని నిజం.

ఇద్దరి మధ్య వాధనప్పుడు ఇండియా క్రికెట్ టీం గొప్ప అంటే అయన మౌనంగా వినేవాడే తప్ప తన వాదన చెప్పేవాడు కాదు. ఐప్పటిలాగానే, అప్పుడు కూడా నా వాదనని ఎదురించటం లేదు అంటే, నేను చెప్పేదే రైట్ అనే ఉద్దేశముతో ఒక సారి ఆగలేక అతడినే ప్రశ్నించాను, ముస్లిం సోదరులు పాకిస్తాన్ క్రికెట్ టీము ని ఎందుకు ఇష్టపడతారు అని. అతడు మల్లాగే చెప్పటం మొదలు పెట్టాడు. మనము ఆటని అట లాగా చూడాలి కాని, దేశాల మద్య పోరాటం లాగా చూడకూడదు. ఇవ్వాల్టి రోజున "ONE DAY " విభాగం లో చూసుకుంటే, ప్రపంచం లోకెల్లా అత్యుత్తమ పది మంది బౌలర్లలో మొదటి రెండు స్తానాలతో పాటు, మొదటి 20 మందిలో దాదాపు ఆరుగురు పాకిస్తాన్ క్రీడాకారులు (వాసిం అక్రం, వకార్ యునిస్ మొదటి రెండు స్తానాల్లో ఉన్నారు). జట్టు నాయకత్వం లోను ఇమ్రాన్ ఖాన్ కాని, తరువాత వచ్చిన వసిం అక్రం కాని, భారత మేటి నాయకుల సగటు కంటే ఎక్కువ ఆటలే గెలిచారు. బ్యాటింగ్ లోకూడా మన కంటే దిగదుడుపు ఏమి కాదు. పైగా గెలవాలి అనే కమిట్మెంట్ లో మనకంటే చాలా ముందు ఉంటారు.

మీకు హిందువులు ఆస్ట్రేలియా క్రికెట్ టీం ని సపోర్ట్ చేస్తే తప్పు అనిపించదు, అది క్రీడ స్పూర్తి అనిపిస్తుంది, అదే ముస్లిం పాకిస్తాన్ టీం ని సపోర్ట్ చేస్తే వెంటనే మతం రంగు పులిమేస్తారు. అటని అట లాగా చూడటం మీరు ఎప్పుడో మరిచారు, మీతో వాదన వ్యర్ధం అని కొనసాగిస్తూ, బజార్ లో ఒక హిందువుని ఎవరన్న కొడితే, ఇంకొక హిందూ రక్షిస్తే కనిపించని మతం, ఒక ముస్లిం ని ఎవరన్న కొడుతుంటే ఇంకో ముస్లిం కాపాడినప్పుడు మీకు ఎందుకు కనిపిస్తుంది. అర్ధం చేసుకోండి లోపం ఎక్కడ ఉందో అని చెప్పారు.

ఒక్క ఉదాహరణతో నాకు అర్ధం అయ్యింది, మన ఆలోచన సరళి ఎంత లోపబుయిష్టంగా ఉందో. వాల్లు తప్పు చేస్తున్నారు అనుకుంటామే కాని మన ఆలోచనలో తప్పు ఉంది అనేది గ్రహించలేకపోతున్నాము.

ఇలాంటి దెబ్బలు చాలా తగిలాక కాని అర్ధం కాలేదు, మనలో మార్పు కూడా సహజంగా రాదు, కొన్ని దెబ్బలు తగిలాకే వస్తుంది అని. ఇవ్వాల్టికి అమెరికాకి వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. పోయిన మూడు సంవత్సరాల నుంచి, క్రమం తప్పకుండ నాతో మద్యాన్నభోజనం చేసేది ఒక పాకిస్తాన్ మిత్రుడు. నాకు లేట్ అవుతుంది అంటే అతను ఆగుతాడు, అతనికి లేట్ అవుతుంది అంటే నేను ఆగుతాను. సీట్లో కనిపించకపోతే వస్తాడులే అని అగుతామే తప్ప మనకేంటి అతడు మన శత్రు దేశం కదా అని ముందుకు పోము. నాకంటే అతడి ఆలోచనే కొంత మెరుగ్గా కూడా ఉంటుంది అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది కూడా.

ఇవ్వాల టీచర్స్ డే సందర్భముగా నాకు చదువు చెప్పిన గురువులు, ఇలాంటి పాటలు చెప్పిన మిత్రులకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, నాకు మంచి చెప్పి, నా ఆలోచనలో మార్పు తెచ్చిన ప్రతి ఒక్కరికి దన్యవాదములు


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.