మా తాత ఇంట్లో పంచె కట్టుకునేవారు, మా నాన్న ఇంట్లో లుంగి కట్టుకునేవారు, నేను ఇంట్లో చెడ్డిలు వేసుకునేవాడిని - మూడు తరాల్లో వేషం మారింది.
మా తాత ఊర్లో వ్యవసాయం చేసేవారు, మా నాన్న కర్మాగారం లో ఉద్యోగం చేసేవారు, నేను అమెరికా లో కంపూటర్లు వెలగబెడుతున్న - మూడు తరాల్లో వ్రుత్తి మారింది.
మా తాత ఊర్లో ఆంద్ర తెలుగు మాట్లాడే వారు, మా నాన్న హైదరాబాద్లో సగం ఆంధ్ర తెలుగు, సగం తెలంగాణ తెలుగు మాట్లాడేవారు, నేను కలిసిన వారిని బట్టి బాష మారుస్తున్న - మూడు తరాల్లో మాట్లాడే బాష మారింది.
మా నాన్న ఆంధ్ర ప్రాంతం లో పుట్టారు, నేను హైదరాబాద్ లో పుట్టాను, నా కూతురు అమెరికా లో పుట్టింది. - మూడు తరాల్లో పుట్టిన స్తలం మారింది.
మా నాన్నకి సంక్రాంతి అంటే ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, నాకు సంక్రాంతి అంటే గాలి పాటాలు, నా కూతురికి హల్లోవీన్, క్రిస్మస్ పండగలు, సంక్రాంతి కి స్కూల్ కి వెళ్ళాలి. - మూడు తరాల్లో పండగలు మారాయి.
వ్రుత్తి, బాష, స్తలం, వేషం అన్ని తరతరానికి మారిపోతుంటే ఇంకా సంస్కృతి, గుర్తింపు అంటారు ఏమిటి మిత్రులారా.
ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు బతకమ్మ చెయ్యవద్దు అనలేదు. అలాగే ఎవరిని సమ్మక్క సారక్క జాతర చెయ్యవద్దు అని కూడా అనలేదు, అలాగే తమ ప్రాంతంలో తమ ఊర్లలో జరిగే గ్రామా దేవత పండుగలను చెయ్యండి అని తెలేన్గన వారిపై అధిపత్యం చేసింది కూడా లేదు. హైదరాబాద్ లో అత్యంత భారీగా చేసే వినాయక చవతి ఉత్సవాల్లో కూడా ఉత్సాహంగా పల్గొంనమే తప్ప, గల్లిలల్లో మైక్లు పెట్టి ఎందుకు హోరెత్తిస్తున్నారు అని ఒక్క సరి కూడా అడగలేదు. అది ఉత్సవం లో భాగం అనే ఉరుకున్నాము.
హైదరాబాద్ లో 1984 వరుకు బతుకమ్మ ఉత్సవాన్ని బరిగా బాగా చేసేవారు, తరువాత ప్రజలు పని వత్తిడి వాళ్ళ కాని, పక్క వారు పెరుగుతున్నారు, తము పెరగకపోతే వెనకబడుతము అని కాని, పండుగలకు ప్రాదాన్యత తగ్గించారు. దీపావళి పండగకి టపాకాయల ధరలు పెరిగాయి అని తక్కువగా కొనటం మొదలుపెట్టినట్టు, దీనిని బుతద్దంలో చూపి ఆంధ్ర పాలకులు మా పండుగలు, ఆచారాలు బుల్ దొజె చేస్తున్నారు అని వాదన ని ముందుకు తెచ్చారు, తెలంగాణ మిత్రులు.
అమెరికా లో డాలర్స్ లో సంపాదిస్తుంటే తెలితల్లేదు కాని, మధ్యతరగతి కి చెందినా మన జనాలు, ఇంట్లో సత్యనారాయణ కధ చేసుకోవటం కేవలం పెళ్ళిళ్ళ సమయంలోనో, లేక గృహ ప్రవేసాలకో చేసేవారు. అది మనకున్న దానిలోనే. ఇప్పుడు దేవుడిపైన నమ్మకం లేను నేనే పోయిన 5 యేఅర్స్ లో దాదాపు 4 సార్లు పూజ చేశాను. నాకు తెలిసిన మిత్రులు కూడా చాల వరుకు ప్రతి సంవత్సరం కాని, లేదా రెండు సంవత్సరాలకు ఒక సారి కాని చేస్తున్నారు.
దీనికి కారణం బక్తి పెరగటం కంటే కూడా, చెయ్యగల తాహతు పెరగటమే అని అనుకోవచ్చు. అలాగే కొంత వెనకబదినట్టు కనిపించిన బతుకమ్మ కాని, సమక్క - సారక్క జాతర కాని ఆంధ్ర ప్రాంతం లో చిన్న ఊర్లలో చేసే గ్రామా దేవత ఉత్సవాలు కాని పెరగటానికి కారణం "చెయ్యగలము అనే ధీమా మాత్రమే"
చెయ్యగలము అని అనుకున్న, చేద్దాము అని ఎవనంన్ ముందుకు వచ్చిన మన పండగలకు కల వస్తుంది, మన భావి తరాలకు ఉపయోగ పడుతుంది.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.