తెలంగాణ లో సకల జనుల సమ్మె వాళ్ళ లాభం ఎవరికీ, నష్టం ఎవరికీ.
తెలంగాణ వస్తే, ఆ ప్రాంతం లో ఉన్న తెలుగు వారు ఎంత బాగుపడతారో తెలిదు కాని, త్రివ్రమైన నష్టం అనుభవిస్తుంది మాత్రం ముమ్మాటికి తెలంగాణ వాసులే. రైతులకు కరెంటు లేదు, విద్యార్ధులకు బదులు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు, చిన్న వ్యాపారాలు చేసే వారి బాధ వర్ణనాతీతం. హైదరాబాద్ చుట్టుపక్కల పని చేసుకునే వారి కష్టాలు పగ వాడికి కూడా రాకూడదు. ప్రింటింగ్ ప్రెస్ లాంటి చిన్న సంస్తాల్లో పని చేసే కార్మికుల ఈ సమ్మె ని ఎంతకాలం బారించగలరు అనేది చెప్పటం కష్టం. వ్యాపారం సరిగ్గా నడవని చిన్న వ్యాపారాలు, తమ దగ్గర రోజు వారి వేతనం పై పనిచేసే వరినికి పని లేదు, వరం తరువాత కనపడు అని చెప్పిన ఘటనలు అనేఖం. వారిని ఆ మాట అనటానికి కూడా లేదు. వాళ్ళకే పనిలేదు, ఇంక పనివారిని పెట్టుకుని చేసేది ఏమిటి.
తెలంగాణ రాష్ట్ర సమితి.
ఈ పోరాటానికి డిస నిర్దేశం చేస్తున్న రాజకీయ సంస్థ, దానికి తోడుగా ప్రొఫెసర్ గారిచేతే నడిపించే రాజకీయ జాక్. ఈ ఉద్యమం వాళ్ళ ఎక్కువ లాభం పొందిన పార్టీ కాని విరి లాభానికి ఒక అంతు అనేది ఉంది. తెలుగు దేశం లో ఉన్న కొందరు నాయకులని ఆకర్షించటం వరుకు నే పరిమితం. అన్ని చేస్తున్నట్టు బిల్డుప్ ఇచ్చుకోవటం తోనే సరి. ప్రతి దానికి కాంగ్రెస్ నాయకత్వం వైపు చూడటం బలహీనత.
తప్పులు
- ప్రతి శాసన సబ్యుడను రాజీనామా చెయ్యమని అడగటం మల్లి ఉప ఎన్నికల్లో పోటి చేయించటం, ఉప ఎన్నికల్లో పోటి చేసే దానికి రాజీనామా ఎందుకు చెయ్యాలి.
- ప్రతి సభ లోను యువకులు ఆత్మా త్యాగం చేస్తున్నారు, ఇంక ఎంత మంది చెయ్యాలి అని జవాబు తెలిసిన ప్రశ్న నే మల్లి మాలి అడగటం. వాళ్ళకు తెలిద ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ రాదు అని.
ఒప్పులు
- ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉండటం. జనాల్లో ఒక ఆలోచన అనేది పుట్టించటం.
కాంగ్రెస్
ఈ ఉద్యమం లో తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ఎక్కువ లాభం పొందిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది ముమ్మాటికి కాంగ్రెస్. ఎప్పటివరుకు, రాజీనామా అని నాటకం ఆడిన, కేంద్రం లో జిమ్మిక్కులు చేసిన అది కాంగ్రెస్ కే సాధ్యం అయ్యింది. రాష్ట్రము లో తెలంగాణ ప్రాంతపు నాయకులూ ఎన్ని అవాకులు చెవాకులు పేలిన, ఢిల్లీ విడుల్లోకి వెళ్ళే సరికి, సోనియాజీ, ఆజాద్ జి అని గౌరవం గా కలవటం చెయ్యల్సింది. ఎవరు అవును అన్న కాదన్నా తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ ప్రబుత్వమే అవ్వాలి, లేకపోతే 2014 లో వేరు ఏదైనా జైతియ పార్టీ అదృష్టం కొద్ది గెలిస్తే అది అవ్వాలి అనేది సత్యం.
కాంగ్రెస్ కి లాభం ఎక్కడ అని ఆలోచన కూడా వ్యర్ధం, ఎందుకంటే, తెలంగాణ ఉద్యమం, వాళ్ళ తెలంగాణ లో తెలుగు దేశం బలహీన పడిన మాట వాస్తవం. నేడు తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన అత్యదిక నాయకులూ, తెలుగు దేశం వారె. తెలుగు దేశం తెలంగాణ లో బలహీన పడటం కాంగ్రెస్ కి కావాల్సిన విష్యం. అలా జరిగినంత కాలం కాంగ్రెస్, తెలంగాణ విష్యం లో సమయం తిసుకున్తూనే ఉంటుంది. ఇప్పటివరుకు కాంగ్రెస్ నుంచి తమ పదవులకు రాజీనామా చేసిన మంత్రులతో సహా ఎవరు, తెలంగాణ రాష్ట్ర సమితి లోకి చేరలేదు, ఏదో నాటకం ఆడుతూ, మేము కాంగ్రెస్ లోనే కార్యకర్తలు గా ఉంటాము అని జనాలని నమ్మిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా తెలుగు దేశం ని ఇబ్బంది పెట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళను పెట్టటం లేదు, ఎందుకంటే, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎప్పుడు తెలుగు దేశం దే తప్పు అని ప్రచారం చేసుకుంటుంది.
కాంగ్రెస్ కి ఉన్న మరో ముక్య కారణం జగన్. తెలంగాణ లో గొడవ నడుస్తున్నత వరుకు జగన్ తెలంగాణ లో అడుగు పెట్టలేదు, తను తీసుకున్న తెలంగాణ పై స్టాండ్ కారణంగా. ఇప్పటికే ఆంధ్ర ప్రాంతం లో బలమైన శక్తీ గా ఎదుగుతున్న జగన్ తెలంగాణ లో పాగా వెయ్యకుండా చూడటం కాంగ్రెస్ కు మంచి పరిణామం.
తెలుగుదేశం
తెలంగాణ లో బలమైన కార్యకర్తల బలం కలిగిన తెలుగు దేశం తెలంగాణ లో తమ వాదన అయినటువంటి అందరు రాజీనామా చెయ్యాలి, చేస్తే, రాజకీయ సంక్షోభము వస్తుంది అని ఎంత మొత్తుకున్నా లాభాల్లో ఉన్న కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కాని వినవు. దానివల్ల వాళ్ళకు లాభాలు లేవు. బలపడరు కూడా. ఏదోఒకటి తెలిస్తే, కనీసం వచ్చే ఎన్నికలకైన తాము నిరంతరం చేసే బాబ్లి పై పోరాటాలు లాంటివి చేసి తెలంగాణ లో బలపడవచ్చు అనేధీ తెలుగు దేశం ఆలోచన, అది జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి కి కాంగ్రెస్ కి పెద్ద లాభం ఉండక పోవచ్చు.
తెలంగాణ లో తిరగలేని జగన్ గురించి ఆలోచన కూడా అనవసరం.
రోబెర్తో ని ప్రధాన మంత్రిని చెయ్యటానికి ఆంధ్ర లో కాంగ్రెస్ కి ఉపయోగ పడే ఉద్యమం తెలంగాణ ఉద్యమం. 2014 లో కాంగ్రెస్ కనుక వాళ్ళ గేమ్ ప్లాన్ ప్రకారం, తెలంగాణ లో బలపడిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రలో బలపడుతున్న జగన్ ని దారిలోకి తెచ్చుకుంటే, ఆంధ్ర నుంచి కనీస స్తాయిలో ౩౩ మంది పార్లమెంట్ సబ్యులతో, దేశాన్ని గాంధీ కరి కుటుంబం ధరి చేర్చటం ఖాయం.
అప్పటివరుకు తెలంగాణ లో పేదవాడు, నేను నా రాష్ట్రము, వచ్చాక వచ్చే అవకాశాలు అనే ఆలోచన తో పస్తులున్దల్సింది.
తెలంగాణ లో సామాన్య మానవుడు తమ అవకాశాలు అని ఆలోచిస్తే, మనల్ని ఏలే మహారాజులు ఆ మాత్రం ఆలోచించరా
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.