NTR రాజకీయాల్లోకి రావటానికి MGR రాజకీయ కెరీర్ ను ఉదాహరణగా చెప్తారు, కాని MGR ముఖ్యమంత్రి గా కన్నా చాలా రోజుల ముందే DMK లో ఉంటూ రాజకీయ ప్రచారాలు, లో ఉంటూ అన్నాదురై చనిపోయిన తరువాత AIDMK స్తాపించి ముఖ్యమంత్రి అయ్యారు. మరి మన NTR కేవలం 9 నెలల వ్యవధి లోనే ఎలాంటి అనుభవము లేకుండా, కేవలం ప్రజలకకు ఎమన్నా చెయ్యాలి అనే తపన తో రాజకీయ రంగం లోకి దూకారు.
కేవలం 9 నేలేఅల్లో, 40000 కిలో మీటర్లు చైతన్య రధం లో రోడ్ షౌస్ చేసి రాజకీయ ప్రచారం అంటే ఎలా ఉండాలి. ప్రజలను ఎలా కలవాలి అని ఒక కొత్త వరవడి ని ప్రారంబించిన మహనీయుడు మన శ్రీ NTR.
కేంద్రం లోని కాంగ్రెస్ గవర్నమెంట్, 20 సూత్రాల కార్యక్రమము, ఘరిభి హట్టావు అంటూ ప్రచారం చేస్తుంటే, మన రాష్ట్రము లో కేవలం "తెలుగు వాడి ఆత్మ గోవరవం" అంటూ రంకె వేసి, రాష్ట్ర ప్రియతమా ముక్యమంతి అయ్యిన వారు, మన శ్రీ NTR.
రెండు రుపయిలకే కిలో భియ్యం పధకం,
మధ్యాన్న భోజన పధకం ,
పక్క గృహాలు పధకం,
తెలుగు గంగ పధకం,
రైతులకు ఉచిత విద్యుత్తూ,
జనత వస్త్రాలు పధకం,
ఇంజనీరింగ్ కళాశాలల్లో డొనేషన్ ను బాన్ చేసి, EMCET పరీక్షాను ప్రవేశ పెట్టడం,
మునసేబ్, పటేల్ వ్యవ్యస్త ల తొలగింపు,
కుటుంబ ఆస్థి లో మహిళలలకు సమన హక్కు, దేశం లోనే తొలిసారిగా అమలుపరిచిన రాష్ట్రము మన ఆంధ్ర ప్రదేశ్.
ఇలాంటి విబిన్నమైన కార్యక్రమాలు ప్రవేశ పెట్టి అనేక వర్గాల ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా, ఒక మనసున్న నాయకుడిగా ఎదిగారు, మన శ్రీ NTR.
1980 లో జనత పార్టీ పతనం తరువాత, కేంద్రం లో కాంగ్రెస్ కు ఎదురు లేని స్తితి లో రాజకీయాలు ఉన్నప్పుడు, NTR ఆంధ్ర ప్రదేశ్ లో సాదించిన విజయం, కాంగ్రెస్ కోటకు భీతలు కొట్టడమే కాకుండా, ముందు తరాలకు, ఒక VP సింగ్, దేవగౌడ, IK గుజ్రాల్ మరియు వాజిపయే లాంటి ప్రధాన మంత్రులు దేశానికీ వచ్చారంటే, దానికి పునాది వేసినది ఒక తెలుగువాడు. మన శ్రీ NTR.
నాదెండ్ల, కేంద్ర ప్రభుత్వ సహాయం తో, గోవర్నోర్ సహాయం తో ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన తరువాత NTR గారు చేసిన రాజకీయ పోరాటం, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం దిమ్మ తిరిగేల చేసింది అని అనటం లో అతి సయోక్తి లేదు. ఇందిరా గాంధీ లాంటి ప్రధాన మంత్రి చనిపోయిన తరువాత దేసమంత సానుభూతి పవనలలో కొట్టుకుపోతే, ఒక్క NTR ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుంచి లోక్ సభకు 30 సీట్స్ గెలిచి కేంద్రం లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, మన రాష్ట్రము లోనే కాకా కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ని పెట్టి ఇందిరా గాంధీ, రాజివ గాంధీ కి పక్కలి బల్లెం లా మరి తెలుగు వాడి పవర్ ని చూపించన వారు మన శ్రీ NTR.
హైదరాబాద్ నగరం అంటే మత కలహాలు అన్కుంటున్న రోజుల్లో, సంగ విద్రోహ శక్తులని నాకబంది చేసి, హైదరాద్ నగరం లో శాంతి బద్రతలను కాపాడిన మొట్టమొదటి ముక్యమంత్రి, హైదరాబాద్ నగరం లో తన్క్బుండ్ పై మన రాష్ట్ర ప్రముకుల స్తుపాలను ఏర్పాటు చేసి తగు విధముగా గౌరవించి, మన హైదరాబాద్ ను నిజమైన బాగ్యనగరం గ మార్చిన మహోన్నత వ్యక్తి మన శ్రీ NTR.
హర్యానా, UP బీహార్, తమిళ్ నాడు, లాంటి ఇతర రాష్ట్రాల్లో NTR సభలకి వచ్చిన జనాదరణ ను చూసి రాజీవ్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టించిన వారు మన శ్రీ NTR.
NTR అధికారం లో ఉన్నప్పుడు సెంట్రల్ గోవేర్నేంట్ లో ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మన రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన విమర్శలను, సవతి తల్లి పరమను ఎదురించి మన రాష్ట్ర హక్కులకే కాక ప్రతి రాష్ట్రానికి బుద్గేట్ లో కేటాయింపులు పెంచటానికి అన్న NTR చేసిన కృషి అభినందనేయం. బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రానికి పునాది అని రాజకీయాలకు కొత్త బాట చూపించింది మన రాజకీయ మేధావి శ్రీ NTR.
NTR కు ఎందులోనూ తీసిపోదు అనుకుంటూ, ముక్యమంత్రి అవ్వటమే జీవన పరమావధి అని, 19 సంవత్సరాల కోరిక, 9 సంవత్సరాల ఉగిస లాట, 8 నెలల ప్రచారం చేసిన మన మెగాస్టార్ పాలకొల్లు లో పొందిన అవమానం మనకు తెలుయని విష్యం కాదు. NTR 2 రూపాయల టికెట్ రేట్ తో, 4 కోట్ల రాష్ట్ర జనాభా తో సినిమాల్లో స్తాపించిన రికార్డ్స్, ను తరువాతి తరం 100 రూపాయల టికెట్ తో 9 కోట్ల రాష్ట్ర జనాభా తో కొట్టలేని సంగతి మనకు తెలిసిందే.
కాంగ్రెస్ వ్యవహార శైలికి విరుద్ధముగా, కుళ్ళు రాజకీయాలు, కబంద హాస్టల షాకే హంద్స్, ద్రుతరాస్త్ర కౌగిల్లు, మనకు నచ్చని వారి వ్యాపార లావాదేవిల పై దెబ్బ తియ్యటం లాంటివి చెయ్యకుండా, కేవలం రోషం తో కూడిన రాజకీయం రుచి ని మన రాష్ట్రానికి, దేశానికీ చూపించిన మహనీయుడు, మన శ్రీ NTR.
కర్రుప్ట్ అనే దాని రంగు రుచి తెలియకుండా తన పార్టీ కి వచ్చిన రాజకీయ దానాలు, వాణిజ్య పరమైన లెక్కలుతన సొంత పార్టీ లో ఒక నీతిని రీతిని చూపించి, ప్రతి పైసాకి లెక్క చూపించిన వ్యక్తి కేవలం తన ఆవేశం వాళ్ళ కొంత మందికి చెడు అయ్యాడు కాని, అవినీతి వాళ్ళ ఎవరితో పల్లెత్తు మాట అనిపించుకున్నవాడు కాదు మన శ్రీ NTR
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.