ఆంధ్రుడు
జనని జన్మభుమిస్చ స్వర్గాదపి గరియసి... శ్రీరాముల వారు రావణాసురుడి లంక పై విజయం సాదించిన తరువాత తమ్ముడు లక్ష్మణుడికి చెప్పిన బోధన. ప్రపంచంలో జువ్స్ (యూదులు) తరువాత జన్మ భూమి లేని జాతి మన ఆంధ్ర జాతి. శ్రీరాముడు రామాయణం లో చెప్పిన, మోసెస్ బైబిల్ లో ఎర్ర సముద్రము ని చిల్చినా, బొమ్మిధ పుట్టిన ప్రతి ఒక్కడికి తన తల్లి ఎంత అవసరమో, అంతే అవసరం ఆచారాలు, మరియు మాతృ భూమి. మరి అలాంటి మాతృ భూమి ఒక్క ఆంధ్రుడికి మాత్రమే ఎందుకు లేదు అంటే చరిత్ర పుటలు తెలుసుకోవాలి.
1083 సంవత్సరం లో వరంగల్ రాజధానిగా తెలుగు మాట్లాడే వారు అందరు కాకతీయుల పాలనా లో ఒక వీసాల సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి వరుకు తెలుగు వారు అనేక తెగలలో బతికేవారు, ఆ తెగలే నేను కులాల రూపంలో రుప్యంతరం చెందాయి. కాకతీయులు నేటి ప్రోఫెస్సోర్లు లాగా కాకుండా చాల తెలివిగా రాజ్యాన్ని తమ జాతి గురించి అలోచించి, తమ రాజ్యం చుట్టూ ఉన్న రాజకుటుంబాల తో వివాహాలు, సంబందాలు ఏర్పాటు చేసుకుని, తమ సామ్రాజ్యాన్ని, ప్రతాపాన్ని కాపాడుకున్నారు.
కాని ఆ రాజ్యం రుద్రమ్మ దేవి పాలనా సమయానికి కొంత పలచన అయ్యి, తమలోతాము గొడవలు పడి కొన్ని కులాలు, కాకతియులపై ఎదురు తిరిగాయి. అదే అదనుగా చూసుకొని, ఢిల్లీ సింహాసనం ఫై కూర్చున్న అల్లాఉద్దిన్ కిలిజి, తన వెయ్యి దినర్లతో కొన్న, కొజ్జ మాలిక్ కఫార్ ని కాకతీయ సామ్రాజ్యం పై దాడి చేయించి, విరోచితముగా పోరాడిన ప్రతాప రుద్రుడు పై విజయం సాదించి, ప్రతాప రుద్రుడిని యుద్ద ఖైదిగా ఢిల్లీ విధుల్లో తిప్పలనుకున్నారు. కానీ వీరుడు ప్రతాప రుద్రుడు, మార్గమధ్యం లోనే ఆత్మహత్య చేసుకోవటం తో కాకతీయ సామ్రాజ్యం తుడిచిపెట్టుకుపోయింది.
కాకతియులపై ఎదురు తిరిగిన కులాలు ఢిల్లీ రాజులతో ఒప్పందాలు చేసుకొని, గులాముల లా కొన్నాళ్ళు రాజ్యాలు ఏలారు. కృష్ణ దేవరాయలు సమయానికి, గోల్కొండ రాజ్యం లో జగిర్దారులుగా మరి, బానిసలూ గా మారిన ప్రజల పై దొరలూ గ చలామణి కావడం మొదలు పెట్టారు.
ఢిల్లీ రాజ్యాదికరానికి గులములు కావటం ఇష్టం లేని కొందరు పల్నాడు లో ముసునూరు నాయకుల పేరుతో రాజ్యాన్ని స్తాపించారు. అదే నమ్మదిగా విజయనగర సామ్రాజ్య స్తాపన కు దారితీసింది. అల తెలుగు నేలను మొత్తం ఏలిన శ్రీకృష్ణ దేవరాయలు కూడా, బహమనీ సుల్తానులు అధినం లో ఉన్న తెలుగు వారి జన్మ భూమిని సంపాదించలేక పోయాడు. అల వదిలిన భూమే, తెలుగు వారి జన్మభుమే, బహమనీ సుల్తానుల నుంచి, నిజాముల వరుకు, దిల్లి తో చుట్టరికం ఉన్న ముస్లిం రులెర్స్ చేతికిందే ఉండిపోయింది.
బ్రితిష్ వాళ్ళు, బహమనీ సుల్తానులు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని పెకిలించి, విజయనగరం లోని కొంత బాగాన్ని, "సెదేడ్" పేరుతో సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మిలిటరీ కర్చులకు ఉంచుకుని, కోస్త ప్రాంతాన్ని, మద్రాస్ ప్రేసిదేన్చి కింద పాలించా సాగారు.
పదమూడవ శతాభ్దములో కలిసిఉన్న ఆంధ్ర ప్రదేశ్ దాదాపు ఏడు వందల సంవత్సరాల తరువాత చాచాజీ వద్దు అన్న, రాజగోపాల చారి అడ్డు పడ్డ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రముగా ఏర్పాటు అయ్యింది.
తెలంగాణ వాదులు మాకు జన్మభూమి ఉంది కదా అనో, లేక ఆంధ్ర ప్రాంతం వారు వారి ఊర్లలోనే వాళ్ళ మాతృభూమిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని అనవచ్చు, అలంటి వారు ఆలోచించాల్సింది ఒక్కటే, కేవలం ప్రపంచం లో అత్యధిక ధనవంతుడు అయిన ఒక్క యుధుడు, తన ఆస్తి తనది కాదు అని అనుకొంటే ఇస్రేల్ కంటే కూడా గొప్పదైన అన్నిటికి ఆమోదయోగ్యమైన భూమిలో తమ మాతృభూమి ఏర్పాటు చేసుకోవచ్చు, ఎప్పుడు యుద్దము వస్తుందో, ఎప్పుడు చస్తామో అని రోజు అలోచిన్చుకొంటు బతకాల్సిన అవసరం ఏముంది?
అన్నదాత, అతడి ఆక్రందన.
ఆంధ్రుల చరిత్రకి అన్నదాతల అక్రందనకి సంబంధం లేకపోయినా, మనము మన ప్రధాన వ్రుత్తి అయిన వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. వ్యవసాయం దండగ, చేసిన వాడికి మిగిలేది లేదు, కాపురం నడపటమే కష్టం, అలంటి పరిస్తితులలో కూడా ఉన్న ఉరిని వదలకుండా, కష్టపడుతూ, పట్నం కి పోయి పతనం కాకుండా, తమ సొంత ఉరిలో కష్టపడ్తుదు, తమ బిడ్డలు ఈ కస్తాల కొలిమి లోనుంచి, ఎగసి పైకి వోద్దామని కొందరు, లేదు, పట్నం వైపు పోయి, తను కూలి పని చేసుకుంటూ, లేదా ఏదోఒక చిన్న కర్మాగారం లో కనీసం నెలకు ఇంత అంటూ వస్తే, బాగుపడతారు, అంటూ పోయిన వారు కొందరు.
1997 నుంచి 2005 వరుకు కేవలం మన దేశం లో ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుని తన ఓటమి ని అంగీకరించారు, ఆధునీకరణ, పరిస్రమికరణ అంటూ చిన్న రైతులకు వ్యవసాయం చేయటం దండగ, తను పండించే పంట రేటు కంటే, విత్తనాలకు, పంట పొలాల మందులకు పెట్టె పెట్టుబడి ఎక్కువ. ప్రతి సంవత్సరం, పెట్టుబడికి అప్పు, అప్పు పై వడ్డీ, పిల్లల చదువు, అడ పిల్లల పెళ్లి అంటూ పడరాని పట్లు పడుతూ, తన కష్టంతో పటు, తమ అదృష్టం మీద ఆధారపడాల్సిన అవసరం రైతు కు ఎందుకు.
ఎనబయ్యో దశకం లో పంటలు బాగా పెరగటానికి వాడిన మందుల ఫలితముగా, ఈ రోజు నెల నిస్సారమై, పంట దిగుబడి తగ్గింది. పైపెచ్చు, ప్రపంచికరన అంటూ, అమెరికా వంటి అబివృద్ది చెందినా దేశాలతో,, రైతులకి చాల ఎక్కువ మోతాదులలో సుబ్సిడి ఇచ్చే వారితో పోటిపెట్టి వారి కంటే తక్కువ ధరకి అమ్మితేనే కొంటారు, లేకపోతే వ్యవసాయం దండగ అనే రీతిలో మాట్లాడే రాజకీయనాయకులు. బ్యాంకు రుణాలు విషయము లో రైతు కష్టం వర్ణనాతీతం. బయట ఎక్కువ శాతం వడ్డీలకు తీసుకున్న రుణాలు కట్టలేక రైతు పడే కష్టం, ఇంకొకరు లేదా తన బిడ్డే పడకూడదు అనుకోవటము లో తప్పు లేదు. ఇలా చనిపోయే రైతు పై ఉన్న ఋణం కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే (సరాసరి)
అన్నదాత కి అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వమా, లేక కేంద్ర ప్రభుత్వమా.
( In lakhs of hectares) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఒక్క సారి పైన వేసిన పట్టికి గమనిస్తే, మనకు తేలికగా అర్ధం అవుతుంది, మన రాష్ట్రములో వరి పంట, 1960 లోని 29.6 లక్షల హెక్టారులు నుంచి ఎప్పుడు 39.82 లక్షల హెక్టారులు కి పెరిగింది, కాని జోవర్ పంట మాత్రం 37.3 లక్షల హెక్టారులు ఎకరాల నుంచి కేవలం 4.44 లక్షల హెక్టారు ఎకరాలకు తగ్గిపోయింది. అదే సమయములో ఆరుతడి పంటలు అయినటువంటి, కాట్టన్, గ్రౌండ్ నుత్, విరివిగా వాడె కమర్షియల్ క్రోప్స్ కూడా గణనీయ స్తాయి లో పెరిగాయి. ఒకప్పుడు తెలంగాణలో తక్కువ నీరుతో పెరిగే జోవర్ పంట పూర్తిగా తగ్గి, ఎక్కువ నిరు వాడె, వరి పంట పెరుగుటతో నిటి కొరత ఏర్పడింది. మరి నిరు కొరతగా ఉన్న పంట ఎందుకు రైతు వేసినట్టు. తన కష్టాన్ని తనే ఎందుకు కొనుక్కున్నట్టు.
ఇక్కడే కేంద్ర లేదా రాష్ట్ర ప్రబుత్వాలు, వరికి మరియు చేరుకుకి, లేదా గోదుమలకి ఇచ్చినట్టు మినిముం సపోర్ట్ రేటు పద్దతిని సరిగ్గా అమలు చెయ్యలేదు. ఈ వ్యత్యాసం వాళ్ళ, వర్శభర పంటలు వేసే రైతులకు జోవర్ లో వచ్చే లాబాలు, వరి వేసే వచ్చే లాబాలకంటే చాల తక్కువగా ఉండేవి. దీనివల్ల నిటి యుద్దాలు స్టార్ట్ అయ్యాయి, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితముగా కరెంటు ఇచ్చిన, పుంపు సెట్ కి అయ్యే కర్చు బరించేది కాదు. ఆ కర్చు రైతులు పెట్టుకోవాల్సి వచ్చేది. అదికూడా కోత కారణముగా తెలంగాణ రైతులు, ఆంధ్ర ప్రాంతంలో కలువ కింద చేసే వ్యవసాయం ఎకరకి నలుగు వందల రూపాయలు అయిన, తెలంగాణ లో అదే పది వేలు అయిన, మాకు కూడా ఉచితముగా చెరువులు కావాలి, మేము కూడా అదే తరహ వ్యవసాయం చేస్తాము అని అడగడం జరుగుతుంది.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.