Powered By Blogger

Sunday, June 24, 2012

Leaders or Show-ers


1990 లో కుకట్ పల్లి లో రోజు విడిచి రోజు పొద్దున్న ౩.౩౦ మున్సిపల్ పైపు లో మంచినిల్లు వచ్చేవి. అంతకముందు రోజు వచ్చిన దానికంటే దరిద్రము, పైగా అంత ఉదయాన్నే లేగవటం కష్టంగా కూడా ఉండేది. పైగా మాములుగా వచ్చే అంత ఫోర్సు గా కూడా వచ్చేవి కావు, కాబట్టి చాల మంది మోటర్లు పెట్టి లాగటం ప్రారంబించారు, కొందరు తమ నిల్ల ట్యాంక్ ని బుమిలోకి తవ్వుకుని, భూమికి 4 నుంచి 10 అడుగుల లోతున నిల్లు పట్టుకునే వారు. కాని అవసరం వల్ల తొందరగానే అలవాటు పడ్డారు, ఒక్కో రోజు ఒక్కొక్కరు బద్దకించేవారు. కొంత లేట్ గా లేగిస్తే రోజు పట్టే మూడు బిందెల బదులు ఒకటో రెండో దొరికేవి. 

ఇది అవసరం, మనిషి నిరు తాగకుండా ఉండలేరు. కాని విషయము మంచి నిరు పట్టుకోవటం కాదు, ఐలా లేట్ గా లేగిసిన పక్కింటి వారిని ఉదయాన్ని లేగిసిన పెద్దాయన, మీరు ఉదయాన్నే లేగావల్సింది అండి, లెగిసి ఉంటె మీకు కూడా 3 బిందెలు దొరికేవి, నాకు చుడండి ఎంచక్కా 3 బిందెల నిల్లు దొరికాయి అని కాలర్ ఎగరేసి హీరో ఫోసే కొట్టేవారు. ప్రబుత్వం ప్రజలకు పొద్దున్న ౩.౩౦ కి నిల్లు ఇస్తున్నారు అనే విష్యం చెప్పేది కాదు, అది కనుగున్న పెద్దాయన ఫోసే చుడతరమే తప్ప చెప్ప తగినది కాదు. 

రోజు గమనించే నేను, మీరు ఇంత కష్టపడాల్సిన పనేముంది, పన్నులు కడుతునారు, కనీసం మంచి నిల్లు మనకు విలు ఉన్న సమయాల్లో ఇవ్వటానికి ఒక అబ్యర్ధన పెడదాము, అందరు శనివారం ఉదయాన్నే ఎనిమిది గంటలకు వస్తే మనము వెళ్లి మాట్లాడవచ్చు అని చెప్పాను. అందరు సరే అన్నారు కాని ఒక్కరు శనివారం కనిపిస్తే ఒట్టు. ఇచ్చిన అవకాసం వాడుకోలేదు అని నేను కూడా వదిలేసాను. మూడు నెలలు తరవాత కూడా అదే తంతు, ఉదయాన్నే లేగవటం పచారి కొట్టు దగ్గరకు వచ్చు వాడు, విడు అని రంకెలు వెయ్యటం, మల్లి రోజు వారి పోరాటాల్లో ఇరుక్కోవటం. పెద్ద ఉపయోగము లేని ప్రయాస.

మన దరిద్రం కాకపోతే ఉదయాన్నే నిల్లు వస్తున్నాయి అని చెప్పిన వాడు నాయకుడు అయ్యాడు, మూడు బిందెల నిల్లు పట్టుకున్న పెద్దాయన నాయకుడు అయ్యాడు.

అసలు ఇలా మనం బతకాల్సిన అవసరం ఏంటి అని చెప్పే వాడిని పట్టించుకోవట్లేదు జనం. ఇది బానిసత్వం లో 800 సంవత్సరాల బానిసత్వం లో మగ్గిన ప్రజల ఆలోచన తిరు. కొంత ఓపిక, కొంత ఆలోచన ఉంటె ఇలాంటి చిన్న కష్టాలు తేలిగ్గా తీరుతాయి కదా. 

ఈ మధ్యనే ఒక మిత్రుడు బెంగాల్ ఉదాహరణ చెప్పాడు, నేను కూడా నా బెంగాల్ మిత్రులని అడిగాను. వాళ్ళు మేము మీ అంత చవటలము కాము, మాకు హక్కుల కోసం పోరాడటం వచ్చు, తప్పు ని నిలదిస్తాము, మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పారు. కాబట్టి మనము అనేవారము మారకపోతే మనకు ఇబ్బందులు తప్పవు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.