ఐదు తలల పాముని చంపొచ్చు కాని తల లేని ఐదు పాముల్ని ఎలా చంపాలి.
పాముని చంపాలి అంటే తల మీద కొట్టాలి అనేది నానుడి. రాష్ట్ర రాజకీయాలు చుస్తే ఎ పాముని కొట్టాలి ఎలా కొట్టాలో అర్ధం కాని పరిస్తితి. నాయకులని అర్ధం చేసుకోవాలో ప్రజలను అర్ధం చేసుకోవాలో కూడా తెలీని పరిస్తితి.
పది నుంచి వెయ్యి వరుకు పంచె ప్రతి నాయకుడు రాజకీయాలు బ్రస్టు పడుతున్నాయి, అని చెప్పేవాడే కాని ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంత పంచుతున్నారు, అంత పంచుతున్నారు అని చెప్పేవాడే. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను తమకు అనుకూలంగా చెప్పేవాడే, మల్లి ఎన్నికలు అనగానే ఆసతో పోరాడి గెలుద్దము అని కర్చు పెట్టె వాడే. రాజకీయ క్రీడని తన్మయత్వముతో ఆడేవాడే.
ప్రజలను అర్ధము చేసుకుందామా అంటే అది ఇంకా కష్టం. ఊర్లకు ఉర్లు మా ఉరి ఓట్లు అన్ని మీకే వేస్తాము, మా ఉరికి ఎంత ఇస్తారో చెప్పండి, ఎప్పుడు ఎలా ఇస్తారో చెప్పండి, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మిధ వొట్టు వేస్తాము అని నిర్మొహమాటంగా చెప్పే స్తాయికి ప్రజలు చేరుకున్నారు.
మేరు పార్టీ మారరా - అది మాకు పట్టదు,
మీరు డబ్బులు తిన్నారా - రాజకీయాల్లో తినంది ఎవరు,
మీ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయా - మీరు మా కులం వాళ్ళు, మీరు కాకపోతే మాకు దిక్కెవరు,
మీరు నియోజకవర్గాని పట్టించుకోరా - మేము కూడా పట్టించుకోము కదా
మీరు వ్యాపారవేత్తలు - వ్యాపారం చెయ్యకపోతే నాయకుడు ఎలా అవుతాడు.
మూడు నెల్ల ముందు ఫలానా మంత్రి అవినీతి పరుడు అని నానా యాగి చేసి దిష్టి బొమ్మలు తగలేట్టిన పార్టీ, ఐవ్వాల అతనే మల్లి తమ పార్టీ లో చేరగానే పునితుడిని చేసి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పినా పట్టదు, ఫలానా మాజీ మంత్రిని జనాల్లో కోట్టించాము/కోట్టించుకున్నాము అని జనాల్లో వధించి, మల్లి అదే పార్టీ మద్దతుతో రాజకీయాలు నడుపుతాము అన్న పట్టదు. మూడు నెలల ముందు స్పీకర్ గదిలోకి జొరబడి మా రాజీనామాలు ఆమోదించండి అని నానా గొడవ చేసి మల్లి మూడు నెలలకి అదే స్పికేర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేసుకోవాటము జనాలకు పట్టదు, ఇదే నాటకము ఇంకా ఎన్ని రోజులు.
ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రజలు ఆలోచిస్తున్నార, లేక చదువుకున్న వాడివలె "dirty politics " అంటూ ఇంగ్లీష్ పదాన్ని వాడి, తమ దైనందిక జీవిత పోరాటానికి అంకితమవుతున్నరా.
ఈ ఉప ఎన్నికలు అనేవి తగ్గించాల్సిన అవసరం ఉంది. నీకు ఒక పార్టీ లో ఎన్నికయ్యి ఆ పార్టీ విధానం నచ్చకపోతే రాజీనామా చేసుకో, ఇదు ఏళ్ళు ఇంట్లో కుర్చుని మల్లి ఎన్నికలకు వెళ్ళు, నీకు మనసు మారినప్పుడు అల్లా ప్రజల సొమ్ము పెట్టి ఎన్నికలు పెట్టటము తప్పు. ఆ ఎన్నికల కర్చు ఒక నియోజకవర్గం అభివృద్దికి సరిపడా నిధులు అని గుర్తించాలి.
విచక్షణ తెలిసిన చదువుకున్న సోదరుడు ఆలోచించాల్సింది మనము ఈ రాజకీయం తో పటు కొట్టుకుపోవల్సిందేనా, లేకపోతే ఎమన్నా మార్పు చేసి దేశానికీ దిశా నిర్దేశం చెయ్యగల సత్తా చుపించాగలమా.
ప్రజలు బాద్యతగా ఉంటేనే, బాద్యత గల నాయకులూ నెత్తిన ఎక్కుతారు, లేకపోతే ఈ పోటు, దానితో వచ్చే పన్ను పోటు మనకు తప్పదు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.