Powered By Blogger

Saturday, July 16, 2011

రాష్ట్ర ముక్యమంత్రా లేక ఢిల్లీ సామ్రాజ్యం లో పనిచేసే గుమ్మస్తానా.

దివాకర్ రెడ్డి గారికి మతి బ్రమించింది అనుకుంట. సీమంధ్ర ప్రాంతం వారికీ మూడు ఏళ్ళు తెలంగాణ వారికీ రెండు ఏళ్ళు ముఖ్యమంత్రి పదవినిద్దము, అల ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని అంటున్నారు. ఈ రాజకీయ రెసెర్వశన్లు ఏమిటి, ఢిల్లీ పెద్దలు నిశ్చయించే ముక్యమంత్రులని ప్రజలు ఒప్పుకునే రోజులు పోయాయి, ఇదేమన్న డ్రామా కంపెనీ అనుకుంటున్నాడ, ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు అనటానికి.

ఈ తెలంగాణ వారికీ ఉప ముఖ్యమంత్రి, లాంటి కాకమ్మ కబుర్లు చెప్పే కదా రెండు ప్రాంతాల వైషమ్యం ఉండేటట్టు చేసిందే నెహ్రు గారు, మల్లి కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు తెర లేపారా.

కుదరదు, రాష్ట్రాన్ని పాలించే హక్కు ప్రజలు ఐవ్వలె కాని, రేసేర్వేసనలు కుదరవు.

పదవులు, ఉద్యోగాలు, అవకాశాలు ఈ ఒప్పందాల ప్రతిపదికనవస్తే, చదివేవాడు, చెయ్యాలి అనుకునేవాడు నాయకత్వపు లక్షణాలు కలవాడు బాద్యతలు చేపట్టేది ఎప్పుడు, ప్రజలు బాగుపడేది ఎప్పుడు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.